Super Hero Shaktiman: దేశీయ సూపర్ హీరో 'శక్తిమాన్' గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1990 నుంచి 2000వరకు డీడీ నేషనల్లో ప్రసారమైన ఈ సీరియల్ ఎంతో ప్రజాదరణ పొందింది. ఇప్పుడీ ధారావాహికను సినిమాగా రూపొందించేందుకు సిద్ధమైంది ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్. ఓ బడా హీరో టైటిల్ రోల్ పోషిస్తారని, ఓ ప్రముఖ దర్శకుడు దీన్ని తెరకెక్కిస్తారని తెలిపింది. త్వరలోనే వివరాలను ప్రకటిస్తామని పేర్కొంది. అప్పట్లో శక్తిమాన్‌గా ముకేశ్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించారు.
-
After the super success of our many superhero films in India and all over the globe, it's time for our desi Superhero!@ThoughtsBrewing @SinghhPrashant @MadhuryaVinay @actMukeshKhanna @vivekkrishnani @ladasingh @sonypicsfilmsin @sonypicsindia pic.twitter.com/sQzS2Z6Oju
— Sony Pictures India (@SonyPicsIndia) February 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">After the super success of our many superhero films in India and all over the globe, it's time for our desi Superhero!@ThoughtsBrewing @SinghhPrashant @MadhuryaVinay @actMukeshKhanna @vivekkrishnani @ladasingh @sonypicsfilmsin @sonypicsindia pic.twitter.com/sQzS2Z6Oju
— Sony Pictures India (@SonyPicsIndia) February 10, 2022After the super success of our many superhero films in India and all over the globe, it's time for our desi Superhero!@ThoughtsBrewing @SinghhPrashant @MadhuryaVinay @actMukeshKhanna @vivekkrishnani @ladasingh @sonypicsfilmsin @sonypicsindia pic.twitter.com/sQzS2Z6Oju
— Sony Pictures India (@SonyPicsIndia) February 10, 2022
పవర్‌ఫుల్‌గా 'సన్ ఆఫ్ ఇండియా' ట్రైలర్..
Mohanbabu Son of India trailer: 'ప్రపంచమంతా నా కుటుంబం. ప్రపంచం బాధే నా బాధ' అని అంటున్నారు ప్రముఖ నటుడు మోహన్‌బాబు. ఆయన హీరోగా నటించిన 'సన్ ఆఫ్ ఇండియా' చిత్రంలోని సంభాషణ ఇది. ఈ సినిమాను ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. 'ప్రపంచంలోని ఏ పోరాటమైనా ఒకడితోనే ప్రారంభమవుతుంది' అనే డైలాగ్‌తో ప్రారంభయ్యే ట్రైలర్ ఆద్యంతం పవర్‌ఫుల్‌గా సాగింది. ఈ ప్రచార చిత్రంలో మోహన్‌బాబు విభిన్నమైన లుక్స్‌లో.. చాలా శక్తిమంతంగా కనిపించారు. ఆయన చెప్పిన ప్రతి సంభాషణ ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా ఉంది. ఆఖర్లో.. ‘మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం మీతోపాటు 138 కోట్ల భారతీయులకు వివరంగా చెబుతా’ అని మోహన్‌బాబు ఫోన్లో చెప్పే మాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సమాధానం ఏంటో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనా, ప్రజ్ఞా జైస్వాల్, శ్రీకాంత్, అలీ, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మంచు విష్ణు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి మోహన్‌బాబు స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. ఇళయరాజా సంగీతమందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టీజర్
Adavallau meeku joharlu movie teaser: శర్వానంద్, రష్మిక జంటగా నటించిన చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. కిశోర్ తిరుమల దర్శకుడు. ఈ సినిమాను ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే ఓ పాటను విడుదల చేయగా టీజర్‌ను గురువారం రిలీజ్ చేసింది. టైటిల్‌కు తగ్గట్టే మహిళలకు ప్రాధాన్యమున్న కథతో ఈ సినిమాను రూపొందించినట్టు తెలుస్తోంది. శర్వానంద్, రష్మిక జోడీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రంలో ఖుష్బూ, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: సమంత సినిమాలో క్రికెటర్ శ్రీశాంత్.. రిలీజ్ డేట్‌తో 'పృథ్వీరాజ్'