బాద్షా షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్.. తన శరీర ఛాయపై వస్తున్న వివక్షపై స్పందించింది. యువకుల మనసులపై నిస్సందేహంగా ఈ ప్రభావం పడుతుందని చెప్పింది. గతకొంత కాలంగా ఈమె ఒంటి రంగుపై నెట్టిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
'నెపోకిడ్' మొదలు ఆమె శరీర ఛాయపైనా పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఇన్‌స్టా వేదికగా మాట్లాడింది. భారతీయ సమాజంలో అందంపై ఉన్న మక్కువను విమర్శించింది. తన శరీర రంగుపై కామెంట్ల స్క్రీన్షాట్లను కొన్నింటిని పోస్ట్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"12 సంవత్సరాల వయసు నుంచే నా శరీర ఛాయపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మనమంతా భారతీయులం కాబట్టి మనందరి రంగు ఇలానే ఉంటుంది. మీ సొంత మనుషులను మీరు ద్వేషిస్తున్నారంటే.. మీ మధ్య ఉండాలంటే భయమేస్తోంది. మంచి పొడవు, రంగు ఉంటేనే మీ దృష్టిలో అందంగా ఉన్నట్లా?. ఇప్పుడు నా చర్మం రంగు వల్ల నాకెలాంటి ఇబ్బంది లేదు. ఇంకా చాలా సంతోషంగా ఉన్నా"
సుహానా, షారుక్ కుమార్తె
'ఎండ్ కలరిజం' హ్యాష్‌ట్యాగ్‌ను ఈ ఫొటోకు సుహానా జోడించింది. మరోవైపు ఆమె తండ్రి షారుక్పైనా పలు విమర్శలు వస్తున్నాయి. ఫెయిర్‌నెస్ క్రీమ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆయన... తన సొంత కుమార్తె విషయంలో ఏం చేస్తారో?
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌లైవ్స్ మేటర్ నినాదాలతో.. స్కిన్‌కేర్ సంస్థలన్నీ ఇప్పటికే ఫెయిర్, వైట్ అనే పదాలను తమ బ్రాండ్ల నుంచి తొలగించాయి. ఆ పదాలను తీసేసినంత మాత్రాన సమస్యలన్నీ తొలగిపోయినట్లేనా అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న ప్రశ్న.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">