ETV Bharat / sitara

Salman Khan: 'బాగా నటించినంత మాత్రాన స్టార్​డమ్ రాదు' - antim the final truth

స్టార్​ హోదా అంత సులువుగా రాదంటున్నారు బాలీవుడ్ స్టార్​ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan New Movie). దాని కోసం యువ నటులు ఎంతో శ్రమించాల్సి ఉంటుందని చెప్పారు. బాగా నటించడం ఒక్కటే చాలదని అన్నారు.

Salman Khan
సల్మాన్ ఖాన్
author img

By

Published : Nov 24, 2021, 7:20 AM IST

యువ నటులు స్టార్‌ హోదా సంపాదించడానికి ఇంకా కష్టపడాలని అన్నారు బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan News). ఆయుష్‌ శర్మతో కలిసి ఆయన నటిస్తున్న చిత్రం 'అంతిమ్‌' (Salman Khan New Movie). ఇది ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సల్మాన్‌ఖాన్‌ విలేకరులతో ముచ్చటించారు.

"స్టార్‌ డమ్‌ ఊరికే రాదు. బాగా నటించిన మాత్రాన వస్తుందంటే కాదు.. దానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. వృత్తిగతంగా, వ్యక్తిగతంగానూ గట్టిగా ప్రయత్నించాలి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. 40 ఏళ్లుగా నేను, షారుఖ్‌, అక్షయ్‌, అజయ్‌లు స్టార్స్‌ హోదాలో ఉన్నాం. దాన్ని అంత సులభంగా కొత్తతరానికి ఇవ్వం. వాళ్లే దాన్ని కష్టపడి సాధించాలి."

-సల్మాన్ ఖాన్, నటుడు

"ఎన్ని ఓటీటీలు వచ్చినా.. తాత్కాలికంగా థియేటర్లు తెరవకపోయినా.. హాల్లో అందరితో కలిసి సినిమా చూడటం అనే అనుభూతి మరెందులోనూ ఉండదు. అందుకే థియేటర్లు మళ్లీ కళకళలాడతాయి" అని అన్నారు సల్మాన్‌.

ఇవీ చూడండి:

చిరంజీవి సినిమాలో సల్మాన్​ఖాన్.. తమన్ క్లారిటీ

ఆ హీరోయిన్​తో ఎప్పటికీ నటించనన్న సల్మాన్​ఖాన్​!

నటనలోనే కాదు.. పెయింటింగ్​లోనూ టాపే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.