ETV Bharat / sitara

Sonu Sood IT Raid:'సోనూసూద్ రూ.20 కోట్ల పన్ను ఎగవేత' - Sonu Sood latest news

నటుడు సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ఆదాయపన్ను విభాగం వెల్లడించింది. శుక్రవారం వరకు ఆయన ఇంట్లో సోదాలు చేపట్టిన ఐటీ విభాగం నేడు (శనివారం) ఓ ప్రకటన విడుదల చేసింది.

Sonu Sood
సోనూసూద్
author img

By

Published : Sep 18, 2021, 1:50 PM IST

Updated : Sep 18, 2021, 3:00 PM IST

ప్రముఖ నటుడు సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు శనివారం ఆదాయపన్ను(ఐటీ) విభాగం వెల్లడించింది. తాజాగా ఐటీ విభాగం సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. నిన్నటి వరకు మూడురోజులు పాటు ఈ సోదాలు చేపట్టింది. పన్ను ఎగవేత ఆరోపణలతో.. అధికారులు ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. ఈ క్రమంలోనే ఐటీ విభాగం నుంచి ప్రకటన వెలువడింది.

Sonu Sood
సోనూసూద్

అలాగే సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్( రెగ్యులేషన్) యాక్ట్‌ను ఉల్లంఘించారని ఐటీ అధికారులు పేర్కొన్నారు. దానికింద క్రౌడ్‌ ఫండింగ్ ద్వారా విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించినట్లు తెలిపారు. సోనూసూద్‌తో పాటు ఆయన సహచరుల కార్యాలయాల్లో కూడా పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలను గుర్తించినట్లు వెల్లడించారు.

కొవిడ్ మహమ్మారి వేళ ఆపన్న హస్తం చాచి, రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. ఆయన చేసిన సేవా కార్యక్రమాలతో దేశ ప్రజల మనసులో నిలిచిపోయారు. కాగా, మొదటి వేవ్ సమయంలో ఆయన ఏర్పాటు చేసిన దాతృత్వ సంస్థ రూ.18 కోట్లకు పైగా విరాళాలను సేకరించిందని అధికారులు వెల్లడించారు. అందులో రూ.1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, మిగతా డబ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందని పేర్కొన్నారు.

విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే ఉద్దేశంతో రూపొందించిన కార్యక్రమానికి దిల్లీ ప్రభుత్వం సోనూసూద్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ సోదాలు జరపడంపై ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన విమర్శలు గుప్పిస్తున్నాయి. భాజపా మాత్రం ఆరోపణలను కొట్టిపారేసింది.

Last Updated : Sep 18, 2021, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.