ETV Bharat / sitara

'ఘోస్ట్​'లో ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ సోనాల్ - సోనాల్ చౌహాన్ బాలయ్య మూవీస్

Sonal chauhan movies: తెలుగులో పలు సినిమాలు చేసిన ముద్దుగుమ్మ సోనాల్ చౌహాన్.. మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. నాగ్ 'ఘోస్ట్' సినిమాలో ఈమె హీరోయిన్​గా ఎంపికైందని సమాచారం.

sonal chauhan
సోనాల్ చౌహాన్
author img

By

Published : Jan 19, 2022, 6:32 AM IST

'లెజెండ్‌', 'పండగ చేస్కో', 'రూలర్‌' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఉత్తరాది అందం సోనాల్‌ చౌహాన్‌. ప్రస్తుతం ఆమె 'ఎఫ్‌3' సినిమాలో నటిస్తోంది. ఇప్పుడీ అమ్మడు తెలుగులో మరో క్రేజీ అవకాశం అందిపుచ్చుకున్నట్లు తెలిసింది.

Nagarjuna the ghost movie: ప్రస్తుతం నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో 'ది ఘోస్ట్‌' అనే చిత్రం రూపొందుతోంది. నారాయణదాస్‌ కె.నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో.. కథానాయికగా తొలుత కాజల్‌ను ఎంపిక చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకొంది. దీంతో ఆ పాత్ర కోసం అమలాపాల్‌, జాక్వెలిన్‌ పేర్లు పరిశీలిస్తున్నట్లు ప్రచారం వినిపించింది. ఇప్పుడీ పాత్రను సోనాల్‌ చౌహాన్‌ దక్కించుకుందని సమాచారం.

sonal chauhan nagarjuna
నాగార్జున-సోనాల్ చౌహాన్

ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని.. తన పాత్ర నచ్చడం వల్ల సినిమా చేసేందుకు సోనాల్‌ అంగీకరించినట్లు తెలిసింది. ఇందులో నాగార్జున మాజీ రా అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి: చలికాలంలో హాట్​ హాట్​ ఫోజుల్లో సోనాల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.