ప్రముఖ గాయని సునీత రెండో వివాహంపై వస్తోన్న గాసిప్స్‌కు చెక్‌పడింది. ఈ వార్తలకు చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు సునీత. ఈమేరకు బిజినెస్మెన్ రామ్ వీరపనేనితో నేడు తన నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించారు. కుటుంబసభ్యులు, మరికొంతమంది సమక్షంలో వేడుకను సింపుల్‌గా నిర్వహించారు.

19 ఏళ్ల వయసులోనే సునీతకు పెళ్లయింది. తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త తీరుతో విసిగిపోయి విడాకులు తీసుకున్నారీ గాయని.

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సునీత. ఆమె పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. టాలీవుడ్‌లో ఏ సింగర్‌కి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ సునీత సొంతం.

