ETV Bharat / sitara

ప్రభుత్వ లాంఛనాలతో శనివారం బాలు అంత్యక్రియలు - sp balasubrahmanyam death news today

SInger SP Balasubrahmanyam no more
దివికేగిన గానగంధర్వుడు- ఎస్పీ బాలు అస్తమయం
author img

By

Published : Sep 25, 2020, 1:24 PM IST

Updated : Sep 25, 2020, 8:39 PM IST

20:28 September 25

తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు. చెన్నై మహాలింగపురం నివాసంలో బాలుకు అభిమానులు నివాళి అర్పించారు. గానగంధర్వుడికి వేలమంది స్థానికులు పుష్పాంజలి ఘటించారు.

20:15 September 25

చెన్నై తామరైపాక్కంలోని వ్యవసాయ క్షేత్రానికి బాలు పార్థివదేహాన్ని తరలించారు. శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

18:39 September 25

చెన్నై కోడంబాక్కంలోని నివాసంలో బాలు పార్థివదేహాన్ని ఉంచారు. స్థానికులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. రాత్రి 9 గంటలకు తామరైపాక్కంలోని వ్యవసాయ క్షేత్రానికి పార్థివదేహాన్ని తరలించనున్నారు. శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

18:06 September 25

తన సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల కళాతపస్వి కె.విశ్వనాథ్ తీవ్ర‌ ఆవేదన వ్యక్తం చేశారు. తన నోట మాటలు రావడం లేదని.. ఇంత తొందరగా బాలు ఈ లోకాన్ని వదిలి వెళ్తాడనుకోలేదని అన్నారు. ‘భగవంతుడు ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదు. బాలు (బాల సుబ్రహ్మణ్యం) నా సోదరుడే కాదు.. నా ఆరో ప్రాణం. అలాంటిది ఇంత తొందరగా జరుగుతుంది అనుకోలేదు. ఇలాంటప్పుడు ఎక్కువ మాట్లాడటానికి కూడా మాటలు రావు. బాలు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులంతా దీన్ని ఓర్చుకుని మామూలు విషయంగా తీసుకోవాలని కోరుతున్నా. ఇంత కంటే నేనేమి మాట్లాడలేను’ అని దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్‌ చెప్పారు.

17:59 September 25

ఎస్పీ బాలు మృతికి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంతాపం. ఆయన లేని లోటు తీర్చలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

17:39 September 25

బాలు గళం మన మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది: మాధురీ దీక్షిత్‌

ఒక శకం ముగిసింది, సంగీత బహుముఖ ప్రజ్ఞాశాలి తనువు చాలించారు: బాలీవుడ్‌ నటి హేమమాలిని

బాలు మరణవార్త తీవ్రంగా కలచివేసింది, ఆయనతో ఉన్న అనుబంధం కళ్లముందు కదలాడుతోంది: గాయని లతా మంగేష్కర్‌

17:00 September 25

''ఈరోజు బాలూ మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. మొట్టమొదట ‘నేనంటే నేనే’ చిత్రానికి మొత్తం పాటలు ఆయనతో పాడిద్దామని ఎస్పీ కోదండపాణిగారు సిఫార్సు చేశారు. డుండీగారు, నేనూ ఒప్పుకొన్నాం. మొత్తం పాటలు బాలు పాడారు. సూపర్‌హిట్‌ అయింది. ఘంటసాలగారు బతికి ఉన్నప్పుడు కూడా నాకు అన్ని పాటలు బాలునే పాడేవారు. అలాంటి వ్యక్తి ఈ రోజు మనల్ని విడిచి వెళ్లిపోవడం బాధాకరం. ఆయన కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నా''

          -సినీ నటుడు కృష్ణ

16:47 September 25

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియలను శనివారం నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. చెన్నై రెడ్‌హిల్స్‌లోని వ్యవసాయక్షేత్రంలో బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. 

బాలు పార్థివదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రి నుంచి కోడంబాక్కంలోని ఆయన నివాసానికి తీసుకొచ్చారు. సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం నివాసంలోనే ఏర్పాట్లు చేశారు. బాలు నివాసం వద్దకు ఇప్పటికే అభిమానులు భారీగా చేరుకున్నారు. తమ అభిమాన గాయకుడి భౌతికకాయం వద్ద అశ్రునివాళి అర్పిస్తున్నారు.  

16:37 September 25

బాలు పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న స్థానికులు, అభిమానులు

ఆస్పత్రి నుంచి నివాసానికి బాలు పార్థివదేహం తరలింపు

చెన్నై కోడంబాక్కంలోని నివాసంలో బాలు పార్థివదేహం

రేపు చెన్నైలో బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు

రేపు చెన్నైలోని వ్యవసాయ క్షేత్రంలో బాలు అంత్యక్రియలు

16:36 September 25

కన్నడిగులను ఎంతో అభిమానించేవారు: యడియూరప్ప 

''ఎస్పీ బాలు తన అద్భుతమైన గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతకారులకు స్ఫూర్తిగా నిలిచారు. కర్ణాటక ప్రజల్ని ఆయన ఎంతో అభిమానించేవారు. అంతటి నిరుపమానమైన వ్యక్తి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానుల్లో ధైర్యం నింపాలని దేవుణ్ని వేడుకుంటున్నా''

       - యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి

16:33 September 25

''ఎస్పీ బాలసుబ్రమణ్యం అంకుల్‌.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. నా హృదయంలోని ఓ భాగాన్ని మీతో తీసుకెళ్లారు. మనమంతా ఈ బాధను తట్టుకోవడం అంత సులభం కాదు. ఓ గాయకుడిగా, వ్యక్తిగా మీకు సాటిలేరు. ఈ రోజు మనకు దుఖాఃన్ని మిగిల్చింది''

         -మంచు లక్ష్మి

16:32 September 25

జున్ను జ్ఞాపకాల్లో బాలు..

''నా హృదయం లక్షలాది పాటలుగా మారి ముక్కలైంది. నేను బాలు గారితో కలిసి షూట్‌(బాలు చివరిగా నటించిన దేవదాస్‌)లో ఉన్నప్పుడు బాబు జున్నును తీసుకుని సెట్‌కు రమ్మని నా భార్య అంజుకు చెప్పా. లెజెండ్‌ బాలుతో దిగిన ఫొటో జున్ను జ్ఞాపకాల్లో ఉండాలి అనుకున్నా''

          -నాని

16:29 September 25

బాలకృష్ణ సంతాపం...

  • ఎస్‌.పి.బాలు మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు: బాలకృష్ణ
  • బాలు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా: బాలకృష్ణ

''16 భాషల్లో 40 వేలకిపైగా పాటలు పాడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి నిష్క్రమణ యావత్‌ సినీ, సంగీత ప్రపంచానికే తీరని లోటు. వ్యక్తిగతంగా నాకు బాలు గారితో ఎంతో అనుబంధం ఉంది. ఆయన పాడిన నాన్నగారి పాటలు, నా పాటలు వినని రోజంటూ ఉండదు. ముఖ్యంగా 'భైరవ ద్వీపం'లో ఆయన ఆలపించిన ‘శ్రీ తుంబుర నారద నాదామృతం’ పాటను ఎప్పుడూ పాడుకుంటూనే ఉంటాను. అలా ప్రతి క్షణం ఆయన్ని తలుచుకుంటూనే ఉంటాను. అలాంటి గొప్ప గాయకుడు, గొప్ప వ్యక్తి మనతో లేకపోవడం ఎంతో విచారకరం. బాలు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.''

-బాలకృష్ణ, సినీ నటుడు

16:22 September 25

శనివారం అంత్యక్రియలు...

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు శనివారం జరగనున్నాయి. చెన్నైలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో వీటిని నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా బాలు పార్థివదేహాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో అభిమానులు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు.

  • ఆస్పత్రి నుంచి నివాసానికి బాలు పార్థివదేహం తరలింపు
  • కోడంబాక్కంలోని నివాసంలో బాలు పార్థివదేహం
  • బాలు పార్థివదేహానికి నివాళులర్పిస్తున్న స్థానికులు, అభిమానులు
  • రేపు చెన్నైలో బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు
  • రేపు చెన్నైలోని వ్యవసాయ క్షేత్రంలో బాలు అంత్యక్రియలు

16:11 September 25

పార్థివదేహం తరలింపు

పార్థివదేహం తరలింపు..

చెన్నై ఎంజీఎం ఆస్పత్రి నుంచి నివాసానికి బాలు పార్థివదేహాన్ని తరలిస్తున్నారు. 

  • చెన్నైలోని వ్యవసాయ క్షేత్రంలో బాలు అంత్యక్రియలు

16:05 September 25

  • బాలు నిష్క్రమణ సంగీత ప్రపంచానికి పూడ్చలేని లోటు: అశోక్ గహ్లోత్‌

16:05 September 25

  • ఒక శకం ముగిసింది, మీరు లేకుండా పాడటాన్ని ఊహించలేను: చిత్ర
  • ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు: నటుడు కార్తి

16:04 September 25

''గంధర్వ లోకానికేగిన గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిసున్నాను''

           -గుణశేఖర్

16:04 September 25

''ఇవాళ లెజెండ్‌ బాలసుబ్రమణ్యంను కోల్పోయాం. ఆయన దాదాపు 16 భాషల్లో వేల గీతాలు ఆలపించారు. ఆయన స్వరం తరం, ప్రాంతం అనే తేడా లేకుండా సంగీత ప్రియుల్ని ఒక్కటి చేసింది. మీరు చిత్ర పరిశ్రమకు చేసిన సేవ.. మా జ్ఞాపకాల్లో మిమ్మల్ని ఎప్పటికీ జీవంతోనే ఉంచుతుంది. బాలు కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా''

        -సినీ నిర్మాత బోనీ కపూర్

16:04 September 25

''ఎస్పీ బాలసుబ్రమణ్యం సర్‌ గురించి తెలిసిన తర్వాత నా గుండె పగిలింది. మీరు సంగీత ప్రపంచానికి చేసిన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. బాలు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా''

 -సల్మాన్‌ ఖాన్‌

16:02 September 25

దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో! 

''బాలు గారితో ముచ్చట్లు, ఆయన జ్ఞాపకాలు ఒక్కసారిగా గుర్తొచ్చే సరికి కన్నీరు ఆగడం లేదు. నా సినిమా ‘అన్నమయ్య’ విడుదలైన తర్వాత ఆయన ఫోన్‌ చేశారు. అప్పుడన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. నా జీవితంలో ఆయన ఓ భాగమయ్యారు. దాచుకో స్వామి మా బాలుని జాగ్రత్తగా దాచుకో'' 

                -నాగార్జున

15:59 September 25

సినీ ప్రముఖుల నివాళి...

నా హృదయంలో బాలు ఎప్పుడూ ఉంటారు: మోహన్‌బాబు

పాట రూపంలో ఎల్లప్పుడూ బాలు మాతోనే ఉంటారు, బాలు గానం అజరామరం: జయసుధ

బాలు కోలుకుంటారనే ఆశతో ఇన్ని రోజులు ఉన్నాం, ఆయన మృతితో దిగ్భ్రాంతికి గురయ్యాం: శ్రేయాఘోశల్

పాటల రూపంలో బాలు గళం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది: సోనాలి బింద్రే

15:58 September 25

  • బాలు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి: పవన్ కల్యాణ్‌
  • ఇలాంటి సమయంలో బాలు మరణం బాధాకరం: పవన్ కల్యాణ్‌

15:58 September 25

దిల్లీ, యూపీ సీఎం నివాళులు...

దిగ్గజ గాయకుడు బాలు మరణవార్త తీవ్ర విచారం కలిగించింది: కేజ్రీవాల్‌

బాలు మరణం సంగీత ప్రపంచానికి తీరని నష్టం: యోగి ఆదిత్యనాథ్‌

''మ్యూజిక్‌ లెజెండ్‌ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరని తెలిసి ఆవేదనకు గురయ్యాను. ఆయన అద్భుతమైన గొంతు తరాల పాటు నిలిచిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, సంగీత సహచరులకు నా ప్రగాఢ సానుభూతి''

                         - మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి

15:48 September 25

బాలూతో చిన్నప్పటి నుంచే అనుబంధం: వెంకటేశ్​

  • మనం ఇవాళ ఒక దిగ్గజాన్ని కోల్పోయాం: నటుడు వెంకటేశ్‌
  • బాలు ఘనత ఎప్పటికీ నిలిచి ఉంటుంది: నటుడు వెంకటేశ్‌

''ఎస్పీ బాలు మృతి భారతీయ సినిమాకు తీరని లోటు. చిన్నప్పటి నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. నేను హీరో కాకముందే ఆయన నాకు తెలుసు. మా సంస్థలో ఎన్నో పాటలు పాడారు. ఆ సమయంలో చెన్నైలో నేనూ రికార్డింగ్‌ థియేటర్‌కి వెళ్లేవాడిని. బాలు కోసం ఎదురు చూస్తూ ఆయన పాట పాడే వరకు అక్కడి నుంచి వెళ్లేవాళ్లం కాదు. ప్రేమ, పవిత్రబంధం చిత్రాల్లో ఆయనతో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాం''

            - సినీనటుడు వెంకటేశ్‌ 

15:42 September 25

రాజమౌళి నివాళులు..

  • తెలుగు, తమిళ, కన్నడ సంగీతాన్ని బాలు దశాబ్దాలపాటు ఏలారు: రాజమౌళి
  • ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అద్భుతం జరగలేదు: రాజమౌళి

''బాలు గారు తెలుగు, తమిళం, కన్నడ భాషల సంగీత ప్రపంచాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏక ఛత్రాధిపత్యంగా పాలించారు. ప్రపంచంలో మరెక్కడా ఇటువంటి అద్భుతం జరగలేదు. ఆ ఏలిక మరి రాదు. చాలా మంది తమిళ కన్నడ సోదరులు ఆయన తెలుగు వాడంటే ఒప్పుకునేవారు కాదు. బాలు మావాడు అని గొడవ చేసేవారు. అన్ని భాషలలో పాడారు. అందరి చేత మావాడు అనిపించుకున్నారు. ఈ ఘనత ఒక్క బాలు గారికే సాధ్యం. ఆయన పాడిన పాటలు మిగిల్చిన అనుభూతులు తరతరాలకీ కొనసాగుతాయి. మహోన్నతమైన ఆయన గాత్రానికి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.''

           -ఎస్‌.ఎస్‌. రాజమౌళి

15:40 September 25

సీఎం పళనిస్వామి సంతాపం..

  • బాలు కుటుంబం, చిత్రపరిశ్రమ, సంగీత అభిమానులకు ప్రగాఢ సానుభూతి: పళనిస్వామి

15:34 September 25

బాలు మరణ వార్తను నమ్మలేకపోతున్నా: సినీనటి తమన్నా

15:20 September 25

మూగబోయిన గానం...

ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి పట్ల రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. బాలు మరణం దేశ సాంస్కృతిక రంగానికి తీరని లోటు అని బాలు కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

దిగ్గజ గాయకుడు ఎస్​పీ బాలసుబ్రమణ్యం మరణం పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఎస్పీ బాలు మృతి పట్ల సంతాపం తెలిపిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, భారతీయ సంగీతం మధురమైన స్వరాన్ని కోల్పోయిందని అన్నారు. పాటల చంద్రుడిగా పద్మభూషణ్‌ సహా అనేక జాతీయ పురస్కారాలను అందుకున్నారని రాష్ట్రపతి కొనియాడారు.

ఐదున్నర దశాబ్ధాలుగా తన అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన ఎస్పీబీ.. అనారోగ్య కారణాలతో మరణించడం దిగ్భ్రాంతి కలిగించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. బాలుది తన ఊరే కావడం వల్ల ఆయనతో చిన్నప్పటి నుంచి పరిచయముందని వెంకయ్య గుర్తుచేసుకున్నారు. కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలో ఇలా జరగడం విచారకరమని అన్నారు. ఈటీవీలో పాడుతాతీయగా కార్యక్రమం ద్వారా.. వేలాది యువ తెలుగు గళాల్ని వెలుగులోకి తీసుకొచ్చారని వెంకయ్య ప్రశంసించారు.

మోదీ విచారం...

మన సాంస్కృతిక ప్రపంచానికి బాలు మరణం పూడ్చలేని లోటని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బాలు స్వరం దశాబ్దాలుగా శ్రోతలను అలరించిందని పేర్కొన్నారు. ఎస్పీబీ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. 

ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు. తన మధుర స్వరం, అసమాన సంగీత ప్రతిభతో ఎప్పటికీ మన మదిలోనే ఉండిపోతారని అమిత్‌ షా పేర్కొన్నారు. 

ఎస్పీ బాలసుబ్రమణ్యం తన పాటలతో లక్షలాది మంది శ్రోతల హృదయాలను తాకారని కాంగ్రెస్‌ సీనియర్‌నేత రాహుల్‌ గాంధీ తెలిపారు. బాలు మరణం పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎన్నో విశిష్టమైన చిత్రాల్లో పాటలు పాడి అభిమానుల మదిలో చెరగని ముద్ర వేశారని రాజ్‌నాథ్‌ కొనియాడారు.

15:15 September 25

రజనీ సంతాపం..

ఎస్​పీ బాలు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు సూపర్​ స్టార్​ రజనీకాంత్​.

మీ స్వరం, మీ జ్ఞాపకాలు నాతో ఎన్నటికీ ఉంటాయి: రజనీకాంత్‌

15:09 September 25

బాలు మృతిపై నివాళులు..

  • బాలుతో జ్ఞాపకాలు కన్నీటి రూపంలో ఉబికి వస్తున్నాయి: నాగార్జున
  • అనేక తరాలకు మీ స్వరం గొప్ప ప్రేరణ: సురేశ్ రైనా

15:00 September 25

భారత సంగీతానికి బాలు ఎనలేని సేవలు అందించారు: వసుంధర రాజే

14:59 September 25

బాలు మరణంతో తెలుగుపాట అనాథగా మారింది: నటుడు కృష్ణరాజు

బాలు స్వరం ఎప్పటికీ నిలిచి ఉంటుంది: నటుడు జగపతిబాబు

14:43 September 25

  • With the unfortunate demise of Shri SP Balasubrahmanyam, our cultural world is a lot poorer. A household name across India, his melodious voice and music enthralled audiences for decades. In this hour of grief, my thoughts are with his family and admirers. Om Shanti.

    — Narendra Modi (@narendramodi) September 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బాలు మృతిపై ప్రధాని మోదీ సంతాపం..

ఎస్​.పి. బాలు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. 

  • మన సాంస్కృతిక ప్రపంచానికి బాలు మరణం పూడ్చలేని లోటు: మోదీ
  • బాలు స్వరం దశాబ్దాలుగా దేశంలో ఇంటింటా అలరించింది: మోదీ
  • బాలు కుటుంబసభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి: మోదీ

14:35 September 25

  • సంగీత ప్రపంచానికి ఇవాళ చీకటిరోజు: చిరంజీవి
  • బాలు మరణంతో ఒక దిగ్గజ సంగీత ప్రయాణం ముగిసింది: చిరంజీవి

14:31 September 25

  • బాలు మరణవార్త నన్ను తీవ్రంగా కలచివేసింది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • పాట మూగబోయింది.. గానగంధర్వుడు నింగికి ఎగిశాడు: దర్శకుడు మారుతీ
  • కోట్లమందిని అలరించిన స్వరం ఇవాళ నింగికి ఎగిసింది: అఖిలేశ్‌ యాదవ్‌

14:29 September 25

ఇవాళ ఓ స్వర దిగ్గజాన్ని కోల్పోయాం: బోనీకపూర్‌

14:26 September 25

బాలు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

భారత సంగీతం ఒక గొప్ప స్వరాన్ని కోల్పోయింది: రాష్ట్రపతి

పాటల చంద్రుడిగా ఎస్పీబీ అనేక పురస్కారాలు అందుకున్నారు: రాష్ట్రపతి

14:24 September 25

  • 50 ఏళ్లుగా అనేక భాషల్లో పాటలు పాడిన గళం ఇవాళ మూగబోయింది: కనిమొళి
  • పాటల రూపంలో మీ స్వరం ఎప్పటికీ మాతోనే ఉంటుంది: శిఖర్‌ ధావన్‌
  • ఇంటింటా బాలు పాట ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది: నటుడు ధనుష్‌
  • అనేక భాషల్లో సంగీత అభిమానులను బాలు పాటలు అలరించాయి: రాహుల్‌గాంధీ
  • ఆయన గళం ఎప్పటికీ నిలిచివుంటుంది: రాహుల్‌గాంధీ
  • ఎస్పీబీ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: రాహుల్‌గాంధీ

14:18 September 25

  • బాలు మరణవార్త విని నా హృదయం వెయ్యి ముక్కలైంది: నటుడు నాని
  • సంగీతం బతికి ఉన్నంతవరకు బాలు జీవించి ఉంటారు: నాని
  • బాలు మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది: క్రికెటర్‌ అశ్విన్‌

14:15 September 25

బాలు ఆకస్మిక మరణవార్త తీవ్ర విషాదాన్ని మిగిల్చింది: కల్వకుంట్ల కవిత

14:13 September 25

  • సంగీత దిగ్గజం బాలును కోల్పోయిన ఈరోజు దుర్దినం: నటుడు సుశాంత్‌
  • అద్భుత పాటల రూపంలో బాలు ఎప్పటికీ మనమధ్యలోనే ఉంటారు: నటుడు నిఖిల్‌

14:10 September 25

  • మధురస్వరాల రూపంలో బాలు ఎప్పటికీ జీవించే ఉంటారు: స్టాలిన్‌

14:09 September 25

  • బాలు మృతి వార్త కోట్లమంది అభిమానులకు తీవ్ర వేదన కలిగిస్తోంది: జావడేకర్‌
  • దేశ సంగీత ప్రస్థానాన్ని సుసంపన్నం చేయడంలో బాలు పాత్ర ఎనలేనిది: గోయల్‌

14:08 September 25

బాలు స్వరాలు మన మదిలో ఎప్పటికీ పదిలంగా ఉంటాయి: గంభీర్‌

14:02 September 25

బాలు మృతి పట్ల రామోజీ రావు తీవ్ర విచారం
  • బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల రామోజీరావు తీవ్ర సంతాపం
  • గుండెలకు హత్తుకుని ప్రేమగా పలకరించే ఆత్మీయుడైన తమ్ముడు బాలు: రామోజీరావు
  • బాలు ఇక లేరంటే బాధగా, దిగులుగా ఉంది: రామోజీరావు
  • ప్రపంచ సంగీతానికే బాలు స్వరం ఓ వరం: రామోజీరావు
  • బాలు పాటలు తేట తియ్యని తేనెల ఊటలు: రామోజీరావు
  • మధుర గాయకుడి మరణం మాటలకందని మహా విషాదం: రామోజీరావు
  • దిగ్గజ గాయకుడి మరణవార్త తీవ్ర విచారకరం: హోంమంత్రి అమిత్‌షా
  • బాలు పాటలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచివుంటాయి: అమిత్‌షా
  • సినీ, సంగీత ప్రపంచం గొప్ప వ్యక్తిని కోల్పోయింది: చిదంబరం

14:01 September 25

  • బాలు మరణవార్త తీవ్ర వేదన కలిగిస్తోంది: నటుడు అక్షయ్‌కుమార్‌
  • తెలుగువారి ఆరాధ్య స్వరం మూగబోయింది: జూనియర్ ఎన్టీఆర్‌
  • భారతీయ సంగీతం తన ముద్దుబిడ్డను కోల్పోయింది: జూనియర్ ఎన్టీఆర్‌

14:00 September 25

  • బాలు కీర్తి తరతరాలు నిలిచిపోతుంది: కమల్‌హాసన్‌
  • బాలు ఉన్న కాలంలో ఉండటం మా అదృష్టం: కమల్‌హాసన్‌
  • బాలు మరణవార్తతో నా హృదయం ముక్కలైంది: వరుణ్‌తేజ్‌
  • సినీపరిశ్రమకు బాలు చేసిన ఎనలేని సేవలకు ధన్యవాదాలు: వరుణ్‌తేజ్‌
  • మన సంస్కృతి, సమాజానికి బాలు లేని లోటు తీరనిది: జేపీ
  • బాలు మరణం చాలా బాధాకరం: విశ్వనాథన్‌ ఆనంద్‌

13:59 September 25

  • ఎస్‌.పి.బాలు మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది: ఉపరాష్ట్రపతి
  • సంగీత ప్రపంచంలో బాలు లేని లోటు పూరించలేనిది: వెంకయ్యనాయుడు
  • ఎస్‌.పి.బాలు మరణవార్త తీవ్ర విషాదం మిగిల్చింది: మమతా బెనర్జీ
  • బాలు సుస్వరాలు తరతరాలకు నిలిచిపోతాయి: మమతా బెనర్జీ

13:57 September 25

  • బాలు లేని లేటు ఊహించలేనిది: సినీనటుడు రామ్‌చరణ్‌
  • ఎప్పటికీ మరిచిపోలేని వ్యక్తి బాలు: సినీనటి రమ్యకృష్ణ
  • బాలు మృతితో లెజెండ్‌ను కోల్పోయాం: సంగీత దర్శకుడు తమన్‌
  • బాలు మరణవార్తతో నా హృదయం ముక్కలైంది: ఎ.ఆర్‌.రెహమాన్‌
  • ఆగిపోయింది మీ గుండె మాత్రమే.. మీ గొంతు కాదు..: దర్శకుడు హరీశ్‌శంకర్

13:56 September 25

  • ఎస్‌.పి.బాలు మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం
  • బాలు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి: సీఎం కేసీఆర్‌
  • ఎన్నో సుమధుర గేయాలు పాడి ప్రజల అభిమానం సంపాదించారు: కేసీఆర్‌
  • బాలు లేని లోటు ఎప్పటికీ పుడ్చలేనిది: సీఎం కేసీఆర్‌
  • గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా సేవలు అందించారు: కేసీఆర్‌

13:55 September 25

  • ఎస్‌.పి.బాలు మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్‌ సంతాపం
  • ఎస్‌.పి.బాలు కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపిన సీఎం
  • ఎస్పీబీగా ప్రసిద్ధిచెందిన బాలు ఇక లేరన్న వార్త ఆవేదన కలిగించింది: సీఎం
  • తన గాత్రంతో ఎన్నో పాటలు పాడి సామాన్యులను సైతం ఆకర్షించారు: సీఎం

13:36 September 25

వేలాది పాటలతో కోట్లాది మందికి సంగీత మాధుర్యం పంచిన గానగంధర్వుడు దివికేగారు. దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. కరోనా సోకి, తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన... చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 1.04కు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ప్రకటించారు.

రెండు రోజుల్లో తిరిగొస్తానని...

ఆగస్టు 5న కొవిడ్​ సోకి, చెన్నైలోని ఎం​జీఎం ఆస్పత్రిలో ఎస్పీ బాలు చేరారు. ఆ విషయాన్ని ఆయనే సామాజిక మాధ్యమాల వేదికగా వీడియో పోస్ట్ చేసి చెప్పారు. రెండు రోజుల్లో కోలుకుని తిరిగొస్తానని అన్నారు. అయితే క్రమంగా ఆయన పరిస్థితి విషమించింది. ఎక్మో, వెంటిలేటర్​ ద్వారా వైద్యులు ప్రత్యేక చికిత్స అందించారు.  

బాలుకు సెప్టెంబర్​ 7న కరోనా నెగిటివ్​గా తేలింది. అయితే ఊపిరితిత్తుల ఇన్​ఫెక్షన్​ దృష్ట్యా ఎక్మో, వెంటిలేటర్​పై చికిత్స కొనసాగించారు వైద్యులు. ఫిజియోథెరపీ చేశారు. ఈ ప్రయత్నాలతో బాలు ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఆయన కుమారుడు చరణ్​ ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా అప్​డేట్స్​ ఇచ్చారు. త్వరలోనే ఎస్పీబీ డిశ్చార్జ్​ అవుతారని అంతా భావించారు. అయితే... అనూహ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించిందని గురువారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. కొద్దిగంటలకే కన్నుమూశారు బాలసుబ్రహ్మణ్యం.

ఎస్పీబీ ఇక లేరన్న వార్తతో సంగీతాభిమానులు విషాద సంద్రంలో మునిగిపోయారు. సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం తెలుపుతున్నారు.  

13:36 September 25

SInger SP Balasubrahmanyam no more
దివికేగిన గానగంధర్వుడు- ఎస్పీ బాలు అస్తమయం

13:36 September 25

SInger SP Balasubrahmanyam no more
దివికేగిన గానగంధర్వుడు- ఎస్పీ బాలు అస్తమయం

13:36 September 25

SInger SP Balasubrahmanyam no more
దివికేగిన గానగంధర్వుడు- ఎస్పీ బాలు అస్తమయం

13:36 September 25

SInger SP Balasubrahmanyam no more
దివికేగిన గానగంధర్వుడు- ఎస్పీ బాలు అస్తమయం

13:36 September 25

SInger SP Balasubrahmanyam no more
దివికేగిన గానగంధర్వుడు- ఎస్పీ బాలు అస్తమయం

13:20 September 25

వేలాది పాటలతో కోట్లాది మందికి సంగీత మాధుర్యం పంచిన గానగంధర్వుడు దివికేగారు. దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కన్నుమూశారు. కరోనా సోకి, తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన... చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.  

Last Updated : Sep 25, 2020, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.