స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ 'వకీల్‌సాబ్' కోసం వచ్చే నెల నుంచే కెమెరా ముందుకు వెళుతున్నట్టు చెప్పింది. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి కథానాయికగా నటిస్తోంది. 'పింక్' సినిమాకు రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది.
అయితే మాతృకకు భిన్నంగా ఇందులో ప్రధాన కథానాయిక పాత్రని సృష్టించినట్టు సమాచారం. ఆ పాత్రలోనే శ్రుతి నటించబోతోంది. అయితే అందులో ఎవరు నటిస్తారనేది ఇప్పటిదాకా అధికారికంగా బయటికి రాలేదు. ఎట్టకేలకు శ్రుతి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటిస్తూ 'వకీల్‌సాబ్'లో నటిస్తున్న విషయాన్ని ఖరారు చేశారు. పవన్ కల్యాణ్‌తో కలిసి శ్రుతి నటిస్తున్న మూడో చిత్రమిది.