పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హిట్ సినిమాల్లో 'ఖుషీ' ఒకటి. భూమిక హీరోయిన్, ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించారు. సరికొత్త ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందించగా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే ఇందులోని పవన్, భూమిక నడుము చూసే సన్నివేశం వెనక ఓ ఆసక్తికర సంగతి దాగుందనే విషయం చాలా మందికి తెలియదు.
ఇంతకీ ఏం జరిగింది?
ఈ సన్నివేశంలో పవన్ హావభావాలు చూస్తే ఎంత చక్కగా నటించారా అనిపిస్తుంది. కానీ దీని వెనక పవన్ అత్యద్భుతమైన నటన దాగి ఉంది. విషయమేమిటంటే హీరో, హీరోయిన్ భూమిక నడుమును చూడలేదు. ఆయన్ని ఓ బల్లపై కూర్చోబెట్టిన దర్శకుడు ఎస్.జె.సూర్య.. ఎదురుగా భూమిక ఉన్నట్లు, ఆమె నడుమును చూస్తున్నట్లు చేసి చూపమన్నారు. అలా తీసిన సీన్లనే తర్వాత భూమిక సన్నివేశాలతో కలిపేశారు. అంతేకాని సినిమాలో చూపించినట్లు నిజంగా అలా జరగలేదు. తెరపై చూస్తే మాత్రం ఎంతో వాస్తవికంగా అనిపిస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">