ETV Bharat / sitara

స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న సాయిపల్లవి - శ్యామ్ సింగ రాయ్ సినిమా

Sai Pallavi Crying: సినీ నటి సాయి పల్లవి స్టేజ్​పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. 'శ్యామ్‌ సింగరాయ్‌' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​లో భావోద్వేగానికి గురయ్యారు. తనని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు.

sai pallavi
సాయి పల్లవి
author img

By

Published : Dec 19, 2021, 11:58 AM IST

Sai Pallavi Crying: పవర్‌ఫుల్‌ కథాంశంతో నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం అభిమానుల సమక్షంలో 'శ్యామ్‌ సింగరాయ్‌' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నటి సాయిపల్లవి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తనని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు. ఆమె కన్నీరు పెట్టుకోవడం చూసి ప్రేక్షకులూ భావోద్వేగానికి లోనయ్యారు.

sai pallavi
సాయి పల్లవి

"పూర్తిగా తెలుగులో మాట్లాడలేకపోతున్నందుకు క్షమించండి. ఈరోజు మీ అందరూ నాపై కురిపిస్తున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే భావోద్వేగానికి గురవుతున్నా. ఈ సినిమా గురించి ఎంతో చెప్పాలని ఉన్నా భావోద్వేగంతో మాటలు రావడం లేదు. నటిగా నన్ను నేను నిరూపించుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ ఇండస్ట్రీకి.. నన్ను నమ్మి అవకాశాలు ఇస్తున్న దర్శకులందరికీ నా కృతజ్ఞతలు. నేనెంతో శ్రమించడం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని అందరూ అంటుంటారు. నిజం చెప్పాలంటే నేను ఏ సినిమాని కష్టంగా భావించి పని చేయలేదు. ఇష్టపడి.. ప్రతి పాత్రను ఎంజాయ్‌ చేస్తూ సినిమా చేశాను. నేషనల్‌ అవార్డు అందుకున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటానని అనుకున్నా. కానీ, ఒక నటిగా ఈ స్టేజ్‌పై ఉండటమే ఓ పెద్ద అవార్డని ఈరోజు అర్థమైంది. అందుకే నాకు కన్నీళ్లు వచ్చేస్తున్నాయ్‌" అంటూ సాయిపల్లవి ఎమోషనల్‌ అయ్యారు. నాని ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.

అనంతరం దర్శకుడు రాహుల్‌ మాట్లాడుతూ.. "ఇండియాలో ఉన్న గొప్ప నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. రాబోయే తరాల నటీమణులకు ఆమె ఒక లెజెండ్‌ అవుతారు. సినిమా పట్ల ఆమెకున్న ప్రేమ అమితమైంది. ఇందులో, ఆమె రోల్‌ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుంది. క్లాసిక్‌ డ్యాన్సింగ్‌ ఉదయం మొత్తం ప్రాక్టీస్‌ చేసి.. రాత్రి పూట భోజనం కూడా చేయకుండా తెల్లవారుజాము వరకూ షూట్‌లో పాల్గొనేవారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన.. మరోస్థాయిలో ఉంటుంది. ఆ మ్యాజిక్​ను 24తేదీన థియేటర్‌లో చూసేందుకు మీతోపాటు నేనూ సిద్ధంగా ఉన్నా. ఆమెతో మరెన్నో సినిమాలు చేయాలని భావిస్తున్నా" అని రాహుల్‌ తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:

కృతిశెట్టితో రొమాన్స్​ గురించి హీరో నాని మాటల్లో..

రెండేళ్లు మిస్‌ అయ్యారు.. ఈసారి క్రిస్మస్‌ మనదే: నాని

Pushpa Movie Director: ఎర్రచందన నేపథ్యం.. 'పుష్ప' శక్తిమంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.