ETV Bharat / sitara

హాట్​కేకుల్లా అమ్ముడుపోతున్న 'రాధేశ్యామ్​', 'ఆర్​ఆర్​ఆర్​' టికెట్లు - RRR usa premiere shows

RRR Radheshyam: 'ఆర్​ఆర్​ఆర్',​ 'రాధేశ్యామ్​' సినిమాలు విడుదల కాకముందే పలు రికార్డులను సొంతం చేసుకుంటున్నాయి. కాగా, ఈ చిత్రాలు అమెరికాలో భారీ స్థాయిలో విడుదల కానున్నాయి. అంతకుముందు ఏ సినిమాకు లేనంతగా రికార్డు స్థాయిలో అడ్వాన్స్​ బుకింగ్స్​ నమోదవుతున్నాయి. ​

RRR Radheshyam USA premiere shows records
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Mar 5, 2022, 12:44 PM IST

Updated : Mar 5, 2022, 1:13 PM IST

Radheshyam USA premiere show : ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్​' కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 11న విడుదల కానున్న ఈ చిత్రం అమెరికాలో గ్రాండ్​గా రిలీజ్​ అయ్యేందుకు సిద్ధమైంది. మార్చి 10న రికార్డు స్థాయిలో ప్రీమియర్​ షోలు ప్రదర్శన కానున్నాయి. 1,116 లోకేషన్లలో 11,116 షోలు వేయనున్నారు. అడ్వాన్స్​ బుకింగ్స్​ కూడా రికార్డు స్థాయిలో అవుతున్నట్లు తెలిసింది.

కాగా, రొమాంటిక్ లవ్​స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి వాయిస్ ఓవర్​​ ఇచ్చారు. ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్- గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RRR USA premiers: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్​ఆర్​' కూడా విడుదలకు ముందే పలు రికార్డులను అందుకుంటోంది. ఈ క్రమంలోనే అమెరికాలో అడ్వాన్స్​ బుకింగ్స్​ ఓపెన్​ చేసిన 10 గంటల్లోనే దాదాపు 5 లక్షల డాలర్లను(హాఫ్​ మిలియన్​) సంపాదించింది. తెలుగు ​రాష్ట్రాల్లోనూ ప్రీమియర్​ షోలు ప్రదర్శించాలని సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 7నే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడినప్పటికీ.. క్రేజ్​ మాత్రం ఏమాత్రం తగ్గలేదనేందుకు ఓవర్​సీస్​లో అడ్వాన్స్​ బుకింగ్సే నిదర్శనం.

కాగా, లండన్​లో ఒడియన్​ బీఎఫ్​ఐ ఐమాక్స్​లోనూ 'ఆర్​ఆర్​ఆర్​' ప్రదర్శనకానుంది. యూకేలోనే ఇది అతి పెద్ద ఐమ్యాక్స్​ థియేటర్​ అవ్వడం విశేషం. కాగా, ఈ తెరపై ప్రదర్శనకానున్న తొలి భారతీయ చిత్రం కూడా ఇదే. యూకేలో దాదాపు 1000 స్క్రీన్లపై 'ఆర్​​ఆర్​ఆర్​'​ రిలీజ్​ కానున్నట్లు తెలిసింది. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న విడుదల కానుంది. దాదాపు రూ.450కోట్ల భారీ బడ్జెట్​తో నిర్మించిన ఈ మూవీలో రామ్​చరణ్​, ఎన్టీఆర్​ ప్రధాన పాత్రలు పోషించారు. అజయ్​ దేవగణ్​, ఆలియా భట్​, శ్రియ కీలక పాత్రలో నటించారు.

ఇదీ చూడండి: అతిపెద్ద స్క్రీన్​పై 'ఆర్​ఆర్​ఆర్'.. వినూత్న​ ఐడియాతో 'రాధేశ్యామ్'​!

Last Updated : Mar 5, 2022, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.