RRR canada fans special video with cars: 'ఆర్ఆర్ఆర్'.. ప్రపంచవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా ఈ పేరే వినిపిస్తోంది. దీని హంగామానే కనిపిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడేకొద్ది.. సెలబ్రిటీల నుంచి అభిమానుల వరకు ప్రతిఒక్కరిలోనూ ఉత్కంఠ, ఆసక్తి పెరిగిపోతుంది. చిత్రం విజయవంతం అవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
అయితే కొంతమంది ఫ్యాన్స్ వినూత్న రూపంలో సినిమాకు సంబంధించిన వీడియోలను తమదైన స్టైల్లో అనుకరిస్తున్నారు. డిఫరెంట్ స్టైల్లో విషెస్ తెలుపుతున్నారు.
తాజాగా కెనడాలోని ఎన్టీఆర్ ఫ్యాన్స్, ప్రవాసభారతీయులు అక్కడివారితో కలిసి ఓ స్పెషల్ వీడియోను రూపొందించి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. కార్లతో ర్యాలీగా వెళ్లి.. 'ఆర్ఆర్ఆర్' ఆకృతిలో వాటిని అమర్చారు. దానికి సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కు జోడించి.. 'తొక్కుకుంటూపోవాలే' అని క్యాప్షన్ జోడించారు. చిత్రం విజయవంతం కావాలని ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి సహా చిత్రబృందానికి ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ వీడియోను మెచ్చిన 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ వీడియోను సోషల్‌మీడియాలో ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇది నెటిజన్లను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. భారీగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.
-
#RRRMassBegins … 🔥🌊🤞🏻
— RRR Movie (@RRRMovie) March 12, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Canada fans, thanks for your love and unmatchable efforts to make this !! ❤️ #RRRMovie
pic.twitter.com/0haQVYMPjA
">#RRRMassBegins … 🔥🌊🤞🏻
— RRR Movie (@RRRMovie) March 12, 2022
Canada fans, thanks for your love and unmatchable efforts to make this !! ❤️ #RRRMovie
pic.twitter.com/0haQVYMPjA#RRRMassBegins … 🔥🌊🤞🏻
— RRR Movie (@RRRMovie) March 12, 2022
Canada fans, thanks for your love and unmatchable efforts to make this !! ❤️ #RRRMovie
pic.twitter.com/0haQVYMPjA
డాల్బీలో తొలి సారిగా
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల స్క్రీన్లపై ప్రదర్శనకానున్న ఈ చిత్రం.. డాల్బీ విజన్ స్క్రీన్‌పైనా కూడా ప్రదర్శన కానుంది. ఈ స్క్రీన్‌పై భారతీయ చిత్రం ప్రదర్శించడం కావడం ఇదే తొలిసారి.
రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాత.
ఇదీ చూడండి: Akhanda 100 days: 'NBK 107' సెట్లో 'అఖండ' టీమ్ సెలబ్రేషన్స్