ETV Bharat / sitara

ఈ బీటౌన్ తారల సంపాదన ఎంతో తెలుసా? - ఆమీర్ ఖాన్ సంపాదన

సల్మాన్​ ఖాన్​తో పాటు పలువురు బాలీవుడ్ తారలు సంపాదనలో కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రేక్షకులకు ఆనందాన్ని ఇచ్చే చిత్రాలు చేస్తూ సినీ లోకాన్ని రంజింపజేస్తున్నారు. అలాగే ఫోర్బ్స్​ జాబితాలోనూ దూసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో బీటౌన్​లో ఎక్కువగా ఆర్జిస్తోన్న నటులెవరో చూద్దాం.

Richest celebrities in Bollywood
ఈ బీటౌన్ తారల సంపాదన ఎంతో తెలుసా?
author img

By

Published : May 12, 2021, 9:31 AM IST

దేశంలోనే అత్యంత ధనిక సినీ పరిశ్రమగా బాలీవుడ్ గుర్తింపు పొందుతోంది. ఇక్కడి సినిమాలకు భారీ బడ్జెట్​లే కాదు హీరోహీరోయిన్లకు పారితోషికాలు ఎక్కువగానే ఉంటాయి. కొందరు స్టార్​ నటులు అయితే కోట్లలో ఆర్జిస్తున్నారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం బీటౌన్​లో టాప్​-10 సెలబ్రిటీస్​ ఎవరో చూద్దాం.

సల్మాన్ ఖాన్

బాలీవుడ్​లో అందరికంటే ఎక్కువ మొత్తంలో ఆర్జిస్తోంది కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఇతడు దాదాపు రూ.250 కోట్లు సంపాదిస్తున్నాడు. భాయ్​జాన్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి గిరాకీ ఉండటం ఇతడి భారీ సంపాదనకు అసలైన కారణం. సినిమాలతో పాటు ప్రకటనల్లోనూ జోరు చూపిస్తాడు సల్మాన్. అలాగే పలు బిజినెస్​లతో పాటు ఇతడికి ఛారిటీలూ ఉన్నాయి.

salman khan
సల్మాన్ ఖాన్

అక్షయ్ కుమార్

ఏడాదిలో డజన్​కుపైగా సినిమాలు చేయగలా సత్తా ఉన్న నటుడు అక్షయ్ కుమార్. మంచి కథ దొరికితే చాలు దాన్ని తక్కువ సమయంలోనే పట్టాలెక్కించేస్తాడు. సంపాదన పరంగానూ ఇతడు టాప్​లో ఉన్నాడు. ఏడాదికి దాదాపు రూ.186 కోట్లు ఆర్జిస్తున్నాడు. సినిమాలతో పాటు ప్రకటనల ద్వారా ఎక్కువగా సంపాదిస్తున్నాడు. అలాగే పలు ఛారిటీలూ ఉన్నాయి.

akshay kuamr
అక్షయ్ కుమార్

దీపికా పదుకొణె

బాలీవుడ్​లో హీరోలకే కాక హీరోయిన్లకు మంచి మార్కెట్ ఉంది. అందుకు దీపికా పదుకొణెనే నిదర్శనం. ఈ నటి ఏడాదికి రూ.113 కోట్లు సంపాదిస్తోంది. బీ టౌన్​ హీరోయిన్లలో అందరికంటే ఎక్కువ ఆర్జిస్తోన్న నటిగా గుర్తింపు సాధించింది. దీపిక భర్త రణ్​వీర్ కూడా రూ.84 కోట్ల వరకు ఆర్జిస్తున్నాడు. వీరిద్దరూ బిజినెస్ పరంగానూ దూసుకెళ్తున్నారు.

deepika
దీపికా పదుకొణె

ఆమిర్ ఖాన్

ప్రేక్షకులకు మంచి చిత్రాలను అందించడంలో ఎప్పుడూ ముందుంటాడు మిస్టర్ పర్​ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. సంపాదన పరంగానూ ముందే ఉన్నాడు. ఇతడు ఏడాది రూ.97 కోట్లు ఆర్జిస్తున్నాడు. సినిమాలే ఇతడి ప్రధాన ఆదాయం. వేరే బిజినెస్​ల వైపు ఇతడు ఎక్కువగా వెళ్లడు.

aamir khan
ఆమీర్ ఖాన్

అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ బిగ్​బీ అమితాబ్ బచ్చన్​ ఎంతో కాలంగా సినీ పరిశ్రమకు సేవలందిస్తున్నారు. ఎందరో హీరోలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. సంపాదన పరంగానూ బిగ్​బీ ముందున్నారు. ఈయన ఏడాదికి దాదాపు రూ.90 కోట్ల వరకు ఆర్జిస్తున్నారు.

amitabh
అమితాబ్

రణ్​వీర్ సింగ్

యువ నటుడు రణ్​వీర్ సింగ్ ఏడాదికి దాదాపు రూ.84 కోట్లు ఆర్జిస్తున్నాడు. పక్కా కమర్షియల్ చిత్రాలతో అలరించే హీరో కొన్ని బిజినెస్​ల్లోనూ రాణిస్తున్నాడు.

ranveer
రణ్​వీర్ సింగ్

అజయ్ దేవ్​గణ్

నటుడిగానే కాక నిర్మాతగానూ ఆకట్టుకుంటున్నాడు అజయ్ దేవ్​గణ్. ఇతడు ఏడాదికి దాదాపు రూ.69 కోట్లు ఆర్జిస్తున్నాడు. మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు.

ajay devgan

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.