ETV Bharat / sitara

MAA Elections: నటీనటులందరికీ నిర్మాతల మండలి కీలక ప్రకటన - ప్రకాశ్​రాజ్ ప్యానల్

ఈ ఏడాది 'మా' ఎన్నికలు(MAA Elections 2021) ఆసక్తికరంగా సాగుతున్నాయి. అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారా? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో నటీనటులందరికీ నిర్మాతల మండలి(Movie Artists Association) ఓ కీలక విజ్ఞప్తి చేసింది.

MAA Elections
'మా' ఎన్నికలు
author img

By

Published : Oct 7, 2021, 1:15 PM IST

తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 'మా' ఎన్నికలు(MAA elections 2021) సాగుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ 'మా' ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారా? అని అటు పరిశ్రమలోని సభ్యులతోపాటు ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈ ఏడాది ఎన్నికల్లో సభ్యులందరూ ఓటు హక్కు వినియోగించుకుంటారా? అని సర్వత్రా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటీనటులందరికీ నిర్మాతల మండలి(Movie Artists Association) ఓ కీలక విజ్ఞప్తి చేసింది. 10 తేదీన జరగనున్న 'మా' ఎన్నికల్లో ఓటేశాకే షూటింగ్‌లకు హాజరు కావాలని సూచించింది. ఎన్నికల అధికారి అభ్యర్థన మేరకే ఈ సూచన చేసినట్లు ప్రకటించింది.

అక్టోబర్‌ 10, ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 'మా' ఎన్నికలు జరగనున్నాయి. ప్రకాశ్‌రాజ్‌(MAA elections prakashraj panel), మంచు విష్ణు(MAA elections manchu vishnu panel).. ఈసారి అధ్యక్ష పదవి కోసం హోరాహోరీగా పోటీ పడుతున్నారు. 'మా'కు శాశ్వత భవన నిర్మాణం, అసోసియేషన్‌ అభివృద్ధి, సభ్యుల సంక్షేమమే ప్రధాన అజెండాగా వీరిద్దరూ బరిలో పోటీపడుతున్నారు.

ఇదీ చదవండి:

maa elections 2021: 'ప్రకాశ్​రాజ్​ను ఓడించి వారిని కాపాడాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.