ETV Bharat / sitara

ప్రభాస్ మరో ఘనత.. దక్షిణాది నుంచి ఒకే ఒక్కడు! - నాగ్​ అశ్విన్

'మోస్ట్​ హ్యాండ్సమ్ ఆసియా పర్సన్'​గా కీర్తి గడించిన ప్రభాస్.. మరో ఘనత సాధించాడు. ఫేస్​బుక్​లో అత్యధిక మంది ఫాలో అవుతున్న టాప్​ 10 భారతీయ స్టార్​ల జాబిలో దక్షిణాది నుంచి చోటు దక్కించుకున్న ఏకైక హీరోగా నిలిచాడు.

prabhas
ప్రభాస్
author img

By

Published : Aug 2, 2021, 9:36 AM IST

Updated : Aug 2, 2021, 11:41 AM IST

'బాహుబలి' సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఫలితంగా టాలీవుడ్ యంగ్​ రెబెల్​ స్టార్ ప్రభాస్​..​ పాన్​ ఇండియా స్టార్​గా ఎదిగాడు. ప్రభాస్​కు వచ్చిన క్రేజ్​తో అతడితో సినిమాలు కూడా పా న్​ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయి. 'రాధే శ్యామ్', 'సలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కె', నాగ్​ అశ్విన్​ల చిత్రాలు కనీవినీ ఎరుగని రీతిలో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా అశేష అభిమానగణాన్ని సంపాదించుకున్న ప్రభాస్.. మరో ఘనత సాధించాడు.

ఫేస్​బుక్​లో అత్యధిక మంది అనుసరిస్తున్న టాప్​ 10 భారతీయ స్టార్​లలో దక్షిణ భారతం నుంచి చోటుదక్కించుకున్న ఏకైక హీరో ప్రభాస్. 2.4 కోట్ల ఫాలోవర్లతో ఈ జాబితాలో ప్రభాస్ 9లో స్థానంలో నిలిచాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (5కోట్లు) అగ్రస్థానంలో ఉండగా.. అక్షయ్ కుమార్(4.8కోట్లు), షారుక్ ఖాన్(4.2కోట్లు), అమితాబ్ బచ్చన్ టాప్​ 5లో ఉన్నారు.

కాగా, ఇటీవలే ఓ ఆసియా మేగజైన్ ప్రభాస్​ను మోస్ట్ హ్యాండ్సమ్ ఆసియా వ్యక్తిగా గుర్తించింది.

ఇదీ చూడండి: ఈ సంక్రాంతికి ఎంటర్​టైన్మెంట్​ మామూలుగా ఉండదు!

Last Updated : Aug 2, 2021, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.