ETV Bharat / sitara

ఆ విషయంలో పూజాహెగ్డే నాకు స్ఫూర్తి: అఖిల్​

తాను నటించిన 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్​'(most eligible bachelor pre release event) ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో పాల్గొన్న హీరో అక్కినేని అఖిల్​.. పూజా హెగ్డే హార్డ్‌ వర్క్‌ తనకెప్పుడూ స్ఫూర్తినిస్తుంటుంది అని అన్నారు. 'లవ్‌స్టోరీ' సినిమా ఓ నమ్మకాన్ని అందించిందని చెప్పారు. కాగా, తన కెరీర్​లో 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్​'(akhil pooja hegde movie name) సినిమా చాలా ప్రత్యేకమైందని చెప్పారు హీరోయిన్​ పూజా హెగ్డే.

pooja
పూజా హెగ్డే
author img

By

Published : Oct 9, 2021, 7:26 AM IST

"అఖిల్‌ ఒక సినిమా ఫలితం కన్నా.. దానికోసం సిద్ధమయ్యే ప్రక్రియని ఎంతో ప్రేమిస్తాడు. తనలోని ఆ లక్షణం నాకెంతో నచ్చుతుంది" అన్నారు కథానాయకుడు నాగచైతన్య. హైదరాబాద్‌లో జరిగిన 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌'(akhil pooja hegde movie name) చిత్ర విడుదల ముందస్తు వేడుకకు(most eligible bachelor pre release event) ముఖ్య అతిథిగా హాజరైన చైతూ ఈ వ్యాఖ్య చేశారు. అఖిల్‌, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రమిది. బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కించారు. బన్నీవాసు, వాసువర్మ నిర్మించారు. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 15న రానుంది.

నాగచైతన్య(nagachaitanya lovestory movie) మాట్లాడుతూ "భాస్కర్‌ మనుషుల మధ్య ఉండే అనుబంధాల్ని, భావోద్వేగాల్ని చాలా బాగా డీల్‌ చేస్తాడు. అఖిల్‌ కెరీర్‌ని స్టార్ట్‌ చేసి నాలుగేళ్లు అవుతోంది. రోజూ ఇంట్లో ఓ కొత్త అఖిల్‌ను చూస్తుంటా. ట్రైలర్‌ చూస్తుంటే ఓ వేడుకలా అనిపించింది. ఈ సమయంలో థియేటర్లలో అలాంటి ఓ వేడుకే కావాలి. అది ఈ సినిమా భర్తీ చేస్తుందని నమ్ముతున్నా" అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అఖిల్‌ మాట్లాడుతూ(akhil most eligible bachelor movie release date)" గర్వంగా చెబుతున్నాం.. మేమందరం ఓ మంచి సినిమా తీశాం. భాస్కర్‌ సినిమాలు, కథలు నాకు చాలా ఇష్టం. ఆయన మెదడులో యుద్ధాలు జరుగుతుంటాయి. ఓ సీన్‌ను ఎలా తీయాలి అని ఎప్పుడూ తపన పడుతుంటాడు. పూజా హార్డ్‌ వర్క్‌ నాకెప్పుడూ స్ఫూర్తినిస్తుంటుంది. కొవిడ్‌ పరిస్థితుల తర్వాత థియేటర్లలో సినిమాలు ఆడతాయా? లేదా? అనుకుంటున్న సమయంలో 'లవ్‌స్టోరీ' సినిమా మాకు ఓ నమ్మకాన్ని అందించింది. ఇప్పుడా నమ్మకాన్ని అందిపుచ్చుకునే మేము అక్టోబరు 15న థియేటర్లలోకి వస్తున్నాం. మంచి రోజులు రాబోతున్నాయి. వంద శాతం ఆక్యుపెన్సీ వస్తుందని కోరుకుంటూ.. కచ్చితంగా గత వైభవాన్ని మళ్లీ చూస్తామని నమ్ముతున్నా. మనం సినిమాలు తీసేదే థియేటర్ల కోసం. అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు రండి. నవ్వుల థెరపీని అనుభూతి చెందండి. ఇక కొవిడ్‌ను మర్చిపోండి" అన్నారు.

బొమ్మరిల్లు భాస్కర్‌(bommarillu bhaskar movies) మాట్లాడుతూ "అఖిల్‌ను తెలుగు ప్రేక్షకులందరి దగ్గరికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఈ సినిమా చేశా. కచ్చితంగా ఇందులో ఆయన్ని ఓ కొత్త కోణంలో.. ఫ్రెష్‌ యాంగిల్‌లో చూస్తారు. విభా పాత్రలో పూజా తన నటనతో నన్ను సర్‌ప్రైజ్‌ చేసింది. ఓ కోపం నుంచి ఈ కథ పుట్టింది. ఈలోకం మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌ను(most eligible bachelor movie) తయారు చేస్తోంది. అయితే వీళ్లలో ఉన్న ఓ చిన్న విషయం ఎవరూ ఎవరికి నేర్పించడం లేదు. అదేంటి? అన్న ఓ చిన్న ప్రయత్నమే ఈ చిత్రం. కచ్చితంగా అది అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నా" అన్నారు.

"నాకెంతో ప్రత్యేకమైన చిత్రమిది. నాకోసం విభా లాంటి పాత్రను సృష్టించినందుకు దర్శకుడు భాస్కర్‌ సర్‌కు కృతజ్ఞతలు. ఇందులో నా పాత్రలో చాలా షేడ్స్‌ ఉన్నాయి" అంది నాయిక పూజా హెగ్డే(pooja hegdey most eligible bachelor). చిత్ర నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ "ఈ చిత్రంతో నా కెరీర్‌లో ఓ మంచి సినిమా తీశానని గర్వంగా చెప్పుకోగలను అనిపించింది. అల్లు అరవింద్‌ సర్‌ సింగిల్‌ సిట్టింగ్‌లో ఈ కథ ఓకే చేశారు. క్లైమాక్స్‌ చూస్తున్నప్పుడు కళ్లలో ఓ కన్నీటి జీర వచ్చింది. ఇదంతా భాస్కర్‌ క్లైమాక్స్‌ను తీర్చిదిద్దుకున్న విధానం.. సంభాషణల వల్లే సాధ్యమైందిఠ అన్నారు. కార్యక్రమంలో అల్లు అరవింద్‌, దిల్‌రాజు, హరీశ్‌ శంకర్‌, మారుతి, వాసు వర్మ, ఆమని, శ్రీమణి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: 'మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచ్​లర్​'లో ప్రభాస్​ ఉన్నాడా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.