సోదరుడు చిరంజీవి కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఇటీవలే వైద్యపరీక్షలు చేయించుకున్న చిరు.. తనకు కొవిడ్ పాజిటివ్‌గా తేలిందని, లక్షణాలు మాత్రం లేవని చెబుతూ ట్వీట్ చేశారు. తనను గత 4-5 రోజుల్లో కలిసిన వారు వైద్యపరీక్షలు చేయించుకోవాలని కోరాడు. హోం ఐసోలేషన్లోకి వెళ్తున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
ఇది చదవండి: