పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కొత్త సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. అభిమానుల ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను ఆగస్టు 15 ఉదయం 9:45 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
![Pawan kalyan rana movie latest update](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12761816_pawan.jpg)
ఇందులో పవన్ సరసన నిత్యా మేనన్ నటిస్తున్నారు. అతడిని ఢీకొట్టే పాత్రలో రానా పోషిస్తున్నారు. ఇతడికి జోడీగా ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది.
మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. స్క్రీన్‌ప్లే, మాటలు అందిస్తుండగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతకాంపై నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఇవీ చదవండి: