ETV Bharat / sitara

నేను గళమెత్తగల శక్తి సినిమానే ఇచ్చింది: పవన్​ కల్యాణ్​ - పవన్​ కల్యాణ్​

తెలుగు సినీ ప్రస్థానంపై ప్రముఖ సినీ విశ్లేషకులు తెలకపల్లి రవి రచించిన 'మన సినిమాలు' పుస్తకాన్ని హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్​లో జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ ఆవిష్కరించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, మహానటి లాంటి చిత్రాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు.

pa1kalyan
author img

By

Published : Aug 13, 2019, 11:27 PM IST

పుస్తకావిష్కరణలో పవన్ కల్యాణ్

మనకున్న సాహిత్య విలువలను అర్థం చేసుకుంటే ప్రపంచాన్ని శాసించే సినిమాలు... తెలుగు పరిశ్రమ నుంచి అందించవచ్చని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి మంచి కథలున్నాయని, వాటన్నింటిని వెలికితీయాలని అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమా ప్రస్థానంపై ప్రముఖ సినీ విశ్లేషకులు తెలకపల్లి రవి రచించిన మన సినిమాలు పుస్తకాన్ని హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్​లో నటుడు, రచయిత తనికెళ్ల భరణి, రావి కొండలరావు, పరిచూరి గోపాలకృష్ణ, సుద్దాల అశోక్​ తేజ, రెంటాల జయదేవ్​తో కలిసి పవన్​ ఆవిష్కరించారు. తొలి ప్రతిని రావి కొండలరావుకు అందజేశారు. మహానటి చిత్రం ఎంతో మందికి ప్రేరణ కలిగించిందన్నారు. అలాంటి సినిమాలు మరిన్ని రావాలని పవన్ ఆకాంక్షించారు. తనకు గళమెత్తే శక్తి సినిమానే ఇచ్చిందని చెప్పారు.

ఇవీ చూడండి:

గాయని సునీత క్రష్​ ఇతడే..

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.