ETV Bharat / sitara

ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సోదరిగా నయనతార - chiranjeevi keerthy suresh

'సైరా'లో మెగాస్టార్ చిరు(chiranjeevi movies) సరసన హీరోయిన్​గా చేసిన నయన్(nayanthara movie list).. ఇప్పుడు సోదరిగా నటిస్తోంది. ఈ విషయం గురువారం రిలీజ్ చేసిన ఓ పోస్టర్​తో ఖరారైంది.

chiranjeevi
చిరంజీవి
author img

By

Published : Nov 18, 2021, 2:08 PM IST

మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi movies) చెల్లెలుగా నయనతార నటించడం ఖరారైంది! నయన్ పుట్టినరోజు(nayanthara birthday) సందర్భంగా 'గాడ్​ఫాదర్'(godfather movie) చిత్రబృందం ఆమెకు విషెస్ చెబుతూ ఓ పోస్టర్​ రిలీజ్ చేసింది.

nayanthara godfather movie
'గాడ్​ఫాదర్' మూవీలో నయనతార

మలయాళ చిత్రం 'లూసిఫర్'కు రీమేక్​గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒరిజినల్​లో మంజూ వారియర్ చేసిన పాత్రనే తెలుగులో నయన పోషిస్తోంది. ఈ చిత్రంలో ఈమెకు రెండోభర్తగా యువనటుడు సత్యదేవ్(satyadev movies) కనిపించనున్నారు. ఇతడే ప్రతినాయకుడు కూడా!

సత్యదేవ్​కు భార్యగా నటించేందుకు నయన్(chiranjeevi nayanthara movies list) తొలుత ఒప్పుకోలేదని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదని తేల్చిన చిత్రబృందం.. సదరు వదంతులకు చెక్ పెట్టింది. వీరిద్దరూ జనవరి నుంచి షూటింగ్​కు వస్తారని సమాచారం.

chiranjeevi godfather movie
మోహన్​రాజా, తమన్​తో చిరంజీవి

ఇంతకుముందు 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో(sye raa narasimha reddy full movie) చిరు, నయన్ జంటగా నటించారు. కానీ ఇందులో వీరిద్దరూ ఎలాంటి రొమాంటిక్ సీన్లు లేవు.

తమిళస్టార్ డైరెక్టర్ మోహన్​రాజా 'గాడ్​ఫాదర్' సినిమాకు(chiranjeevi godfather movie) దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూర్చుతున్నారు. సూపర్​గుడ్​ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరోవైపు చిరంజీవి 'ఆచార్య' పూర్తిచేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న థియేటర్లలోకి రానుంది. అలానే 'భోళాశంకర్'(bhola shankar 2021) షూటింగ్​లోనూ పాల్గొంటున్నారు. ఇందులో మెగాస్టార్ చెల్లెలుగా కీర్తి సురేశ్ చేస్తోంది. బాబీ దర్శకత్వంలోనూ చిరు చేయాల్సిన ఓ సినిమా.. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది.

chiranjeevi bhola shankar movie
కీర్తి సురేశ్​తో చిరంజీవి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.