ETV Bharat / sitara

Netrikann Movie Review: నయనతార 'నెట్రికన్‌' ఎలా ఉందంటే..? - నయనతార 'నెట్రికన్‌'

నయనతార నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ 'నెట్రికన్'. డిస్నీఫ్లస్‌ హాట్‌స్టార్​లో శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది ఈ రివ్యూ చూసి తెలుసుకుందాం.

Netrikann Movie
'నెట్రికన్‌'
author img

By

Published : Aug 14, 2021, 5:41 PM IST

చిత్రం: నెట్రికన్‌

నటీనటులు: నయనతార, అజ్మల్‌, కె.మణికందన్‌, శరణ్‌శక్తి తదితరులు

సంగీతం: గిరీష్‌ గోపాలకృష్ణన్‌

సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌

ఎడిటింగ్‌: లారెన్స్‌ కిషోర్‌

నిర్మాత: విఘ్నేష్‌ శివన్‌

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మిలింద్‌ రావ్‌

విడుదల: డిస్నీ+ హాట్‌స్టార్‌

మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలంటే గుర్తొచ్చే అతి తక్కువమంది నటుల్లో నయనతార ఒకరు. తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితురాలు. అనేకమంది అగ్ర కథానాయకులతో ఆమె ఆడి పాడారు. ఇక ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన పలు తమిళ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఆమె కీలక పాత్ర పోషించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ 'నెట్రికన్‌'. ఇందులో ఆమె అంధురాలిగా నటించడం సినిమాపై అంచనాలను పెంచింది. మరి ఈ సినిమా కథేంటి? అంధురాలి పాత్రలో నయనతార ఎలా నటించారు?

nayanthara
'నెట్రికన్‌' సినిమా పోస్టర్​

కథేంటంటే:

సీబీఐ ఆఫీసర్‌ దుర్గ(నయనతార) ఓ ప్రమాదంలో తమ్ముడితో పాటు, కంటి చూపును కూడా కోల్పోతుంది. అయినా, దృఢ సంకల్పంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. మరోవైపు నగరంలో వరుసగా అమ్మాయిలు అపహరణకు గురవుతుంటారు. ఒకరోజు రాత్రి బస్టాప్‌లో క్యాబ్‌ కోసం వేచి ఉన్న దుర్గను ట్యాక్సీ డ్రైవర్‌ అని చెప్పి జేమ్స్‌(అజ్మల్‌) కారు ఎక్కించుకుని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో జేమ్స్‌ ఒక వ్యక్తిని ఢీకొట్టడంతో దుర్గకు అనుమానం వచ్చి, కారు నుంచి దిగి వెళ్లిపోతుంది.

ఇదే విషయాన్ని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తుంది. అక్కడి ఎస్సై మణికంఠ(మణికందన్‌) ఈ కేసును మామూలుగా తీసుకుంటాడు. దుర్గ ఒత్తిడి మేరకు కేసు విచారణ మొదలు పెట్టిన పోలీసులకు అనేక విషయాలు తెలుస్తాయి. ఇంతకీ జేమ్స్‌ ఎవరు?ఎందుకు అమ్మాయిలను అపహరించడానికి ప్రయత్నిస్తున్నాడు? దుర్గ, ఎస్సై మణికంఠ ఈ కేసును ఎలా పరిష్కరించారు? చివరకు నిందితుడు పోలీసులకు దొరికాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

nayanthara
'నెట్రికన్‌'లో నయనతార

ఎలా ఉందంటే:

సౌత్‌ కొరియన్‌ మూవీ 'బ్లైయిండ్‌'కు రీమేక్‌గా తెరకెక్కిన చిత్రమే 'నెట్రికన్‌'. ఇటీవల కాలంలో క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతున్నారు. ఆసక్తికర కథ, కథనాలతో చివరి వరకూ ప్రేక్షకుడిలో ఉత్కంఠను కలిగిస్తే ఆ సినిమా విజయం సాధించినట్టే. గుప్పెట మూసి ఉన్నంతవరకూ లోపల ఏముందో తెలియదు. ఒకసారి తెరిస్తే, అందులో ప్రేక్షకుడు ఊహించుకున్నది లేకపోతే నిరాశ తప్పదు. ఈ విషయంలో నెట్రికన్‌ దర్శకుడు మిలింద్‌ రావు కొంతవరకూ విజయం సాధించాడు.

nayanthara
'నెట్రికన్‌' చిత్రంలో నయనతార

సీబీఐ ఆఫీసర్‌ దుర్గ తన తమ్ముడితో కలిసి కారులో వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై కళ్లు పోగొట్టుకునే సన్నివేశంతో కథను ప్రారంభించాడు దర్శకుడు. అసలు పాయింట్‌కు రావడానికి కాస్త ఎక్కువ సమయమే తీసుకున్నాడు.

జేమ్స్‌ తన కారులో దుర్గను అపహరించేందుకు ప్రయత్నించడంతో కథ అసలు ట్రాక్‌ ఎక్కుతుంది. అక్కడి నుంచి కేసును పరిష్కరించేందుకు దుర్గ, ఎస్సై మణికంఠ, డెలివరీ బాయ్‌ గౌతమ్‌ ప్రయత్నం చేయటంతో కథ పరుగులు పెడుతుంది. ఈ క్రమంలో తన గురించి తెలిసిన గౌతమ్‌, దుర్గలను పట్టుకునేందుకు జేమ్స్‌ వెంటాడే సన్నివేశాలు ఉత్కంఠగా సాగుతాయి. ముఖ్యంగా మెట్రోట్రైన్‌, దానికి కొనసాగింపుగా వచ్చే సీన్లు ఆసక్తికరంగా ఉంటాయి. విరామానికి ముందు వచ్చే ఈ సన్నివేశాలు ఆద్యంతం అలరిస్తాయి.

జేమ్స్‌ ఎలా ఉంటాడన్న విషయం తెలిసిన తర్వాత ప్రేక్షకుడిలో ద్వితీయార్ధంపై ఉత్కంఠ పెరుగుతుంది. అయితే ఆ అంచనాలను దర్శకుడు అందుకోలేకపోయాడు. ప్రతి సన్నివేశాన్ని డీటెయిల్డ్‌గా చెప్పే ప్రయత్నంలో సినిమా నిడివిని పెంచేశాడు. ఆయా సన్నివేశాలన్నీ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. జేమ్స్‌ పోలీసుల నుంచి తప్పించుకునే సీన్‌ ఇప్పటికే కొన్ని వందల సినిమాల్లో చూశాం. పతాక సన్నివేశాలు కూడా రొటీన్‌గా సాగుతాయి. అయితే, జేమ్స్‌ నుంచి దుర్గ ఎలా తప్పించుకుంటుంది? లేక అతడిని ఎలా చంపుతుందన్న ఉత్కంఠను మాత్రం దర్శకుడు చివరి వరకూ కొనసాగించాడు. దుర్గకు కళ్లు రావడం వెనుక ఉన్న పాయింట్‌ భావోద్వేగాన్ని కలిగిస్తుంది. ద్వితీయార్ధంలో ఇంకాస్త నిడివి తగ్గించి, కథకు అవసరమైన సన్నివేశాలను మాత్రమే తెరపై చూపించి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.

ఎవరెలా చేశారంటే:

nayanthara
'నెట్రికన్‌' చిత్రంలో నయనతార

ఈ తరం కథానాయికల్లో మహిళా ప్రాధాన్యం ఉన్న కథలంటే గుర్తొచ్చే నటి నయనతార. ఆయా పాత్రల్లో ఆమె చక్కగా ఒదిగిపోతారు. 'నెట్రికన్‌'లోనూ తన నటనతో మెస్మరైజ్ చేశారు. అంధురాలిగా హావభావాలు పలికించడంలో మెప్పించారు. సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. జేమ్స్‌ పాత్రలో అజ్మల్‌ ఓకే. అయితే, జేమ్స్‌ పాత్ర తాలూకూ క్రూరత్వాన్ని తెరపై చూపించలేకపోయారు. ఎస్సైగా మణికందన్‌, డెలివరీ బాయ్‌గా శరణ్‌ శక్తి తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా సినిమా బాగానే ఉంది. ఛేజింగ్‌ సీన్లను గిరీష్‌ గోపాలకృష్ణన్‌ నేపథ్య సంగీతం హైలైట్‌ చేసింది. ఆర్‌.డి. రాజశేఖర్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. అంధురాలైన నయనతార రోడ్డు మధ్యలో నిలబడిపోయినప్పుడు కేవలం ఆమె ముఖాన్ని చూపించడం ద్వారా అలాంటి పరిస్థితిలో మనం ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందన్న భావనను కలిగించారు. లారెన్స్‌ కిషోర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. బహుశా థియేటర్‌లో విడుదలను దృష్టిలో పెట్టుకుని, వదిలేసి ఉంటారు. డీటెలింగ్‌ కోసం ద్వితీయార్ధంలో నిడివి పెంచేసిన సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది.

nayanthara
'నెట్రికన్‌' చిత్రంలో నయనతార

ఒక పాయింట్‌ పట్టుకుని రెండున్నర గంటలు.. అదీ ఓటీటీ ముందు ప్రేక్షకుడిని కూర్చోబెట్టడం సాధ్యమయ్యే పనికాదు. దర్శకుడు మిలింద్‌ రావు కొరియన్‌ మూవీ థీమ్‌ను తీసుకుని, దాన్ని మన నేటివిటీకి అనుగుణంగా చక్కగా తీర్చిదిద్దినా, నిడివి పెరగడం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది.

బలాలు

  • నయనతార
  • ప్రథమార్ధం
  • సాంకేతిక బృందం పనితీరు

బలహీనతలు

  • అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం
  • నిడివి

చివరిగా: క్రైమ్‌ థ్రిల్లర్‌ అంటే ఇష్టమా.. నిడివి ఉన్నా పర్వాలేదా.. అయితే ఈ వీకెండ్‌లో 'నెట్రికన్‌' మీకోసమే!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ఇదీ చదవండి: Pagal movie review: 'పాగల్'​ ప్రేమ సక్సెస్ ​అయిందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.