ETV Bharat / sitara

'కళావతి' పాట కొత్త రికార్డు.. నాని 'దసరా' షురూ - sarkaru vaari paata songs

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'కళావతి' సాంగ్, నాని 'దసరా', సూర్య 'ఈటీ' చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్
author img

By

Published : Feb 16, 2022, 3:51 PM IST

Nani dasara movie: నేచురల్ స్టార్ నాని ఫుల్​ జోరుమీదున్నాడు. 'శ్యామ్​సింగరాయ్'తో సక్సెస్​ కొట్టిన అతడు.. 'అంటే సుందరానికీ' షూటింగ్ పూర్తిచేశారు. ఈ సినిమా వేసవిలో థియేటర్లలోకి రానుంది. ఇప్పుడు 'దసరా' మొదలుపెట్టేశారు. ఈ చిత్రం బుధవారం, హైదరాబాద్​లో లాంఛనంగా ప్రారంభమైంది.

dasara movie launch
దసరా మూవీ పూజా కార్యక్రమం

ఖమ్మం నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమాలో నాని.. ఫుల్​ గెడ్డంతో, మాస్​ లుక్​లో కనిపించనున్నారు. తెలంగాణ యాసలోనూ డైలాగ్స్​ పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో హీరోయిన్​గా కీర్తి సురేశ్ నటించనుంది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు.

kalavathi song: మహేశ్​బాబు కొత్త సినిమా 'సర్కారు వారి పాట'. ఇందులోని 'కళావతి' సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్​లో సెన్షేసన్​ సృష్టిస్తోంది. ఈ క్రమంలో సరికొత్త రికార్డు సొంతం చేసుకుంది. టాలీవుడ్​లో అత్యంత వేగంగా 1 మిలియన్​ లైకులు అందుకున్న పాటగా నిలిచింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బ్యాంక్​ పన్నుల ఎగవేత నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమాలో మహేశ్​ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్​గా నటిస్తుంది. తమన్ సంగీతమందిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్​టైన్​మెంట్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మే 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

సూర్య 'ఈటీ' టీజర్ ఈనెల 18న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఇందులో సూర్య సరసన ప్రియాంక మోహన్​ హీరోయిన్​గా చేస్తుంది. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 10న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

Suriya ET movie
సూర్య 'ఈటీ' పోస్టర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.