ETV Bharat / sitara

ఓటీటీలో బాలయ్య.. హోస్ట్​గా రచ్చ రచ్చే! - balakrishna akhanda movie

హీరో బాలకృష్ణ (Balakrishna talk show) త్వరలోనే ఓటీటీ ప్లాట్​ఫామ్​ 'ఆహా' వేదికగా ఓ టాక్​ షోకు హోస్ట్​గా వ్యవహరించనున్నారు. 'అన్​స్టాపబుల్ విత్​ ఎన్​బీకే'​ పేరుతో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ఆహా ట్వీట్​ చేసింది.

balayya
బాలకృష్ణ
author img

By

Published : Oct 10, 2021, 1:37 PM IST

మాస్​ డైలాగ్స్​​, యాక్షన్​ సీన్స్​తో(Balakrishna talk show) ఇప్పటివరకు వెండితెరపై అదరగొట్టిన నటసింహం బాలకృష్ణ సరికొత్త అవతారమెత్తనున్నారు(Balakrishna akhanda movie). ఓ టాక్​ షోకు హోస్ట్​గా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు.

సరికొత్త సినిమాలు, వెబ్​సిరీస్​లతో జోరు మీదున్న తొలి తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా'(OTT platform aha).. టాక్​షోలతోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే 'అన్​స్టాపబుల్'​ పేరుతో మరో టాక్​ షోను తీసుకురానుంది. ఈ కార్యక్రమానికే బాలయ్య హోస్ట్​గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని 'ఆహా' అధికారికంగా ప్రకటించింది. "ఆయన అడుగేసి షో మొదలుపెడితే.. అన్ని టాక్​షోలకు ఇది బాప్ లాంటిది​. పైసావసూల్​ ఎంటర్​టైన్​మెంట్​కు సిద్ధమవ్వండి" అంటూ రాసుకొచ్చింది. అయితే తొలి ఎపిసోడ్​ ఎప్పుడు ప్రసారమవుతుంది అనేది చెప్పలేదు.

మొదటి ఎపిసోడ్​లో భాగంగా బాలయ్య(balakrishna new movie).. మంచు కుటుంబ సభ్యులతో ఈ షోను ప్రారంభిస్తారని సమాచారం. మరోవైపు, ఇటీవల ఆయన 'లైగర్'​ చిత్రబృందాన్ని కలిసి వచ్చారు. ఈ మూవీ టీమ్​నే ఆయన ఇంటర్వ్యూ చేయనున్నారని అంతా మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ షోపై బాలయ్య అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

త్వరలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖండ'(Akhanda movie release date) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు బాలకృష్ణ.

ఇదీ చూడండి: 'బాలకృష్ణ కోసం కథ సిద్ధం చేస్తున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.