2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు సినిమాలతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, ప్రధాని నరేంద్ర మోదీ వంటి చిత్రాలు ఓట్లు రాబట్టుకోవటానికి, నేతలపై ఉన్న వ్యతిరేకతను తొలగించుకునేందుకు ఉపయోగపడుతున్నాయి.ఈ బయోపిక్‌లలో రాజకీయ నాయకులు పడిన బాధలు, కష్టాలను వివరిస్తున్నారు. ఫలితంగా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 'నాపేరు రాగా' సైతం ఈ కోవకు చెందినదే. రాహుల్ చిన్నతనం నుంచి నేతగా ఎదిగే వరకు జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దీనికి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇది నాలుగు నిముషాల నిడివిలో రూపొందించారు. ఈ చిత్రానికి రూపేష్ పాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో 'సీక్రెట్ డైరీ ఆఫ్ మోనాలిసా సెయింట్','కామసూత్ర 3డీ' చిత్రాలు తెరకెక్కించారు.
యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్:
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రధాని నరేంద్ర మోదీ:
- " class="align-text-top noRightClick twitterSection" data="">