ETV Bharat / sitara

'దాసరి'ని అద్భుతంగా వర్ణించిన మెగాస్టార్ చిరు

author img

By

Published : May 4, 2020, 4:05 PM IST

దర్శకరత్న దాసరి జయంతి సందర్భంగా ట్వీట్ చేసిన చిరు.. ఆయన స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే ఉంటుందని పేర్కొన్నారు. మిస్​యూ సర్ అంటూ రాసుకొచ్చారు.

'దాసరి'ని అద్భుతంగా వర్ణించిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవితో దాసరి నారాయణరావు

దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి నేడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనను స్మరించుకుంటున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, దాసరిని వర్ణిస్తూ ట్వీట్ చేశారు. ఆయన మన మధ్య లేకపోయినా, స్పూర్తి సజీవంగానే ఉంటుందని రాసుకొచ్చారు.

  • దా..దానంలో కర్ణుడుమీరు

    స..సమర్ధతలో అర్జునుడుమీరు

    రి..రిపువర్గమేలేని ధర్మరాజుమీరు

    మీరు మా మధ్య లేకపోయినా మీ స్ఫూర్తి ఎప్పుడూ సజీవంగానే వుంటుంది.

    ప్రతీ భావిదర్శకుడి జీవితానికి మార్గదర్శకమవుతుంది.

    This was my last memory of Guruvu garu.We miss u Sir #LastPressmeet #Dasari pic.twitter.com/XBOUmIqLyW

    — Chiranjeevi Konidela (@KChiruTweets) May 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"దా.. దానంలో కర్ణుడు మీరు, స.. సమర్ధతలో అర్జునుడు మీరు, రి.. రిపువర్గమే లేని ధర్మరాజు మీరు, మీరు మా మధ్య లేకపోయినా ఎప్పుడూ మీ స్ఫూర్తి సజీవంగానే ఉంటుంది. ప్రతి భావిదర్శకుడి జీవితానికి మీరే మార్గదర్శకమవుతారు. గురువుగారితో ఇది నా చివరి జ్ఞాపకం. మిస్ యూ సర్" -మెగాస్టార్ చిరంజీవి ట్వీట్

ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన వ్యక్తిగా దాసరి నారాయణరావు రికార్డు సృష్టించారు. దీనితో పాటే రచయిత, నిర్మాత, నటుడిగా ఎన్నో విజయాలు అందుకున్నారు. 1942 మే 4న జన్మించి 2017 మే 30న తుదిశ్వాస విడిచారు. చిరు-దాసరి కాంబినేషన్​లో 'లంకేశ్వరుడు' సినిమా వచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.