మా ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో అధ్యక్షబరిలో నిలిచిన మంచు విష్ణు మేని ఫెస్టో ప్రకటించారు. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు విషయాలు వెల్లడించారు.
నటులందరికీ అవకాశాలు కల్పించడమే తమ ప్రథమ లక్ష్యమని విష్ణు అన్నారు. అవకాశాల కల్పనకు 'మా' యాప్ సిద్ధం చేస్తామని చెప్పారు. జాబ్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. సొంత డబ్బుతో 'మా' భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి కళాకారులకు సొంత ఇళ్లు ఏర్పాటు చేయిస్తామని అన్నారు.
అలానే 'మా' సభ్యులకు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తామని మంచు విష్ణు అన్నారు. ప్రతి మూడు నెలలకు ఓసారి మెగా వైద్య శిబిరం పెడతామని చెప్పారు. సభ్యులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. 'మా' సభ్యుల పిల్లల కోసం ఉపకార వేతనాలు అందజేస్తామని అన్నారు.
'మా' సభ్యుల కుటుంబంలో పెళ్లికి రూ.1.16 లక్షలు ఇస్తామని మంచు విష్ణు చెప్పారు. మహిళల రక్షణకు హై పవర్ ఉమెన్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. వృద్ధ కళాకారులకు రూ.6 వేలకు పైగా పింఛన్ ఇస్తామని స్పష్టం చేశారు.
తాము గెలిస్తే 'మా' సభ్యత్వ రుసుము రూ.లక్ష నుంచి రూ.75 వేలకు తగ్గిస్తామని విష్ణు చెప్పారు. జూన్‌లో మోహన్‌బాబు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఇన్స్టిట్యూట్లో 'మా' సభ్యులకు 50 శాతం ఉపకారవేతనం అందిస్తామని అన్నారు. వృద్ధ కళాకారులకు 'మా' ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు.
ఇవీ చదవండి:
- MAA Elections 2021: 'మా'లో తారస్థాయికి మాటల యుద్ధం
- MAA Elections 2021: పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలోనే 'మా' ఎన్నికలు
- MAA Elections: నరేశ్, కరాటే కల్యాణిలపై నటి హేమ ఫిర్యాదు
- MAA Elections: నటీనటులందరికీ నిర్మాతల మండలి కీలక ప్రకటన
- maa elections 2021: 'ప్రకాశ్‌రాజ్‌ను ఓడించి వారిని కాపాడాలి'
- MAA Elections: వారికి మద్దతిస్తేనే సినిమాల్లో ఛాన్స్ ఇస్తా అన్నాడు!