ETV Bharat / sitara

విష్ణుకు చిరు అభినందనలు.. 'మా' సభ్యత్వానికి నాగబాబు రాజీనామా - maa elections winners list

'మా' ఎన్నికల్లో అధ్యక్షునిగా విజయం సాధించిన మంచు విష్ణుకు అభినందనలు తెలిపారు మెగాస్టార్​ చిరంజీవి. మరోవైపు విష్ణు గెలిచిన కొన్ని నిమిషాల్లోనే ప్రకాశ్​రాజ్​కు మద్దతుగా నిలిచిన మెగాబ్రదర్​ నాగబాబు 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశారు.

chiru
చిరు
author img

By

Published : Oct 11, 2021, 7:53 AM IST

తెలుగు ప్రజల్లో ఆసక్తి రేపిన 'మా' ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. నువ్వానేనా అన్నట్లు తలపడిన పోరులో ప్రకాశ్​రాజ్​పై అధ్యుక్షుడిగా మంచువిష్ణు గెలుపొందారు. ఈ సందర్భంగా పలువురు విష్ణుకు అభినందనలు తెలపగా.. మెగాస్టార్ చిరంజీవి సైతం ట్విట్టర్ వేదికగా విష్ణుకు కంగ్రాట్స్​ తెలిపారు. నూతన కార్యవర్గం నటీనటుల సంక్షేమం కోసం పాటుపడుతుందని ఆశీస్తున్నాన్న చిరంజీవి... మా ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే కుటుంబమన్నారు. ఎవరు గెలిచినా కుటుంబం గెలిచినట్టేనని, ఆ స్ఫూర్తితోనే అందరం ముందుకుసాగుదామని పిలుపు నిచ్చారు.

chiru
విష్ణుకు చిరు అభినందనలు

నాగబాబు రాజీనామా

విష్ణు గెలిచిన కొన్ని నిమిషాల్లోనే ప్రకాశ్ రాజ్​కు మద్దతుగా నిలిచిన మెగాబ్రదర్ నాగబాబు 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశారు. 48 గంటల్లో తన రాజీనామాను మా అసోసియేషన్ కార్యాలయానికి పంపనున్నట్లు ట్విట్టర్​లో తెలిపారు. ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వంతో మా అసోసియేషన్ కొట్టుమిట్టాడుతోందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

chiru
'మా' సభ్యత్వానికి నాగబాబు రాజీనామా

ఇదీ చూడండి: ఈ విజయం నాన్నకు అంకితం: విష్ణు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.