ETV Bharat / sitara

యూట్యూబ్​లో ఈ ఏడాది ఎక్కువమంది చూసిన వీడియో ఇదే! - లుట్​ గయే సాంగ్​

Most Watched Music Video This Year: ఈ ఏడాదిలో భారత్​లో ఎక్కువ మంది చూసిన వీడియో సాంగ్స్​, టాప్​లో ట్రెండ్​ అయిన వీడియోలకు సంబంధించిన గణాంకాలను యూట్యూబ్​ విడుదల చేసింది. బాలీవుడ్​ నటుడు ఇమ్రాన్​ హష్మీ నటించిన సూపర్​ హిట్​ సాంగ్​ 'లుట్ ​గయే'ను ఈ సంవత్సరం ఎక్కువ మంది చూసినట్లు పేర్కొంది.

Most Watched Music Video This Year
ఎక్కువ మంది చూసిన వీడియో
author img

By

Published : Dec 3, 2021, 1:26 PM IST

Updated : Dec 3, 2021, 1:53 PM IST

Most Watched Music Video This Year: నటుడు ఇమ్రాన్​ హష్మీ, యుక్తి తరేజా జంటగా నటించి, ప్రముఖ నేపథ్య గాయకుడు జుబిన్ నౌత్యాల్​ పాడిన సూపర్​ హిట్​ సాంగ్​ 'లుట్​ గయే'ను ఈ ఏడాది ఎక్కువమంది చూసినట్లు యూట్యూబ్​ ప్రకటించింది. 'జోంబీ-ది లివింగ్ డెడ్' అనే 40 నిమిషాల హరర్​ కామెడీ చిత్రం.. ఈ ఏడాదిలో టాప్ ట్రెండింగ్​ మొదటి స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఈ వీడియోను రౌండ్​ 2 హెల్ అనే ఛానల్​ అప్​లోడ్​ చేసినట్లు తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వీటితో పాటు ర్యాపర్​ బాద్​షా, యో యో హనీ సింగ్​ పాడిన రెండు పాటలు 'పానీ పానీ', 'సైయాన్ జీ', ఇటీవల విడుదల అయిన షేర్షా సినిమా నుంచి 'రాతాన్ లంబియాన్' పాటలు భారత దేశంలో ఎక్కువ మంది చూసిన టాప్ 10 వీడియో పాటల్లో స్థానం సంపాదించినట్లు యూట్యూబ్​ పేర్కొంది.

రౌండ్​ 2 హెల్​ అనే య్యూట్యూబ్​ ఛానల్​ సుమారు 2కోట్ల 36 లక్షల సబ్​స్కైబర్లతో మొదటి పది స్థానాల్లో ఒకటిగా నిలిచినట్లు యూట్యూబ్​ తెలిపింది. దీనితో పాటు గేమింగ్​కు సంబంధించి టోటల్​ గేమింగ్​, మేజర్లీ కంప్రెస్డ్​, టెక్నో గేమర్స్​, లోకేష్​ గేమర్, ఏ_ఎస్​ గేమింగ్​ అండ్, జ్ఞాన్​ గేమింగ్​ ఛానళ్లు టాప్​ టెన్​లో స్థానం సంపాదించాయి.

Youtube Trending Videos

యూట్యూబ్​లో టాప్​ ట్రెండింగ్​..

యూపీఎస్​సీ- ఆప్షనల్​ మైన్​ క్యా హై, ది ల్యాండ్​ ఆఫ్​ బిగ్​ బాస్​, ది మమ్మీ రిటర్స్​, భిడే జంప్స్​ ఆఫ్​ బాల్కనీ, తారక్​ మెహ​తా కా ఉల్టా చష్మా​ లాంటి వీడియోలు టాప్​ 10 ట్రెండింగ్​లో స్థానం సంపాదించాయి.

Youtube Shorts..

యూట్యూబ్​ షార్ట్స్​..

ఇక యూట్యూబ్​ షార్ట్స్​ విషయానికి వస్తే.. ఏ2 మోటివేషన్​, మిస్టర్​ జ్ఞాని ఫ్యాక్ట్​ షేర్డ్​ అండ్​ ఫ్యాక్ట్స్​ అండ్​ నాలెడ్జ్​ లాంటివి బాగా పాపులర్​ అయినట్లు పేర్కొంది. వీటితో పాటు క్రేజీ ఎక్స్​వైజెడ్​, మిస్టర్​ ఇండియన్​ హ్యాకర్​ లాంటివి కూడా ప్రజల ఆదరణ పొందినట్లు యూట్యూబ్​ తెలిపింది.

ఇదీ చూడండి: ఓటీటీలో ఈ రోజే ఇన్ని సినిమాలు రిలీజ్.. మీరేం చూస్తున్నారు?

Last Updated : Dec 3, 2021, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.