బాలీవుడ్ నటి మాల్వి మల్హోత్రాపై ముంబయిలో కత్తి దాడి జరిగింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మాల్వి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా యోగేశ్ కుమార్ మహిపాల్ అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలైన ఆమె ప్రస్తుతం కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
యోగేశ్, మాల్వి 2019 నుంచి ఫేస్ బుక్‌లో ఫ్రెండ్స్‌గా ఉన్నారు. అప్పటి నుంచి మూడు, నాలుగు సార్లు కలుసుకున్నారు. ఆమెను కలిసినప్పటి నుంచి తనను ప్రేమించమంటూ యోగేశ్ వెంబడిపడుతున్నట్లు సమాచారం. పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేసినట్లు తెలుస్తోంది. అయితే మాల్వి ఇందుకు నిరాకరించగా గత కొన్ని రోజులుగా ఆమెను ఫోన్లో ఇబ్బందిపెడుతున్నాడు.
ఈ క్రమంలోనే సోమవారం మాల్వి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆడి కారులో వచ్చిన యోగేశ్ ఆమెను అడ్డగించాడు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. మాల్వి అందుకు నిరాకరించడం వల్ల కత్తితో పొత్తి కడుపులో పొడిచాడు. తర్వాత వెన్ను, భుజంపైనా కత్తిపోట్లతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న యోగేశ్‌పై వెర్సోవా పోలీస్ స్టేషల్లో కేసు నమోదైంది.