ETV Bharat / sitara

కీరవాణిని మెప్పించిన తెలుగు సినిమా - కీరవాణి మెచ్చిన సినిమా

సినిమాల్లో బీజీగా ఉండే సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబంతో ఎలా గడుపుతారు? ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో సాంధించిన విజయాలేంటీ? తనయుల వృత్తి గురించి, తాను పనిచేసిన చిత్రాల్లో గర్వంగా, తృప్తినిచ్చి సినిమా గురించి ఈటీవీ భారత్​తో పంచుకున్నారు.

కీరవాణిని మెప్పించిన తెలుగు సినిమా
కీరవాణిని మెప్పించిన తెలుగు సినిమా
author img

By

Published : Apr 26, 2020, 8:46 PM IST

ఈటీవీ భారత్​తో సంగీత దర్శకుడు కీరవాణి ముఖాముఖి

ప్ర: మీ కుటుంబ సభ్యులతో చిత్ర పరిశ్రమకు ఎనలేని అనుబంధం ఉంది. ఇంతమంది ఎంగేజ్​ చేయగలుగుతున్నారు కదా.. ఏమనిపిస్తుంది..?

జ:ఎవరి కాళ్ల మీద వారు నిలబడ్డారు. అనే దృక్పథంతోనే ఉంటాను. ఇంత మంది నా వాళ్లు చిత్ర పరిశ్రమలో ఉన్నారు అని ఎప్పుడూ అనుకోను. ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఎవరి పని మీద వాళ్లు బిజీగా ఉంటున్నారు. అందుకు గర్వపడుతున్నా.

ప్ర: ఇన్నేళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించారు. ఎలా అనిపిస్తుంది..?

జ: బ్రహ్మానందంతో పోల్చితే నేనెక్కడా. ఆయన తన కెరీర్​లో ఎంతో మందిని అలరించారు. సినిమా అనేది ఒక వృత్తి అంతే. వృత్తిలో సక్రమంగా పనిచేస్తున్నామనేదే గర్వకారణం.

ప్ర: మీ అబ్బాయిల్లో ఒకరు గాయకుడు.. మరొకరు నటుడు.. వారి గురించి..?

జ: మంచి పేరు తెచ్చుకున్నందుకు సంతోషం. వాళ్లు ప్రారంభ దశలో ఉన్నారు. ఈ పరిశ్రమలో కష్టపడితేనే పైకి వస్తారు. లేదంటే జారిపోతారు.

ప్ర: ఆర్​ఆర్​ఆర్​పై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే టీజర్​ ఎలా ఉండబోతుంది..?

జ: తర్వాత టీజర్​ కరోనా స్థాయిలో ఉండబోతుంది(నవ్వుతూ). కరోనా వల్ల ఏ మేరకు మా పని ప్రభావమైందో అలా ఉండబోతుంది. అది మంచైనా.. చెడైనా..!

ప్ర: ఆర్​ఆర్​ఆర్​పై కరోనా ప్రభావం ఉంటుందా..?

జ: ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం అన్ని పనులు ఆగిపోయాయి. లాక్​డౌన్​ తర్వాత మేం ఎలా పనిచేయగలమో అలానే చేస్తాం.

ప్ర:మీ కెరీర్​లో మీకు గర్వంగా అనిపించిన, తృప్తినిచ్చిన చిత్రం ఏది..?

జ: తృప్తినిచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. గర్వంగా అనిపించిన సినిమా 'మర్యాద రామన్న'.

ప్ర: మీకు సినిమాల్లో నటించాలని ఎందుకు అనిపించలేదు..?

జ: ఎవరి పని వారే చెయ్యాలి. నాకు నటన రాదు.

ప్ర: కరోనా నేపథ్యంలో ప్రజలకు మీరిచ్చే సూచనలేంటి..?

జ:చాలా మంది సూచనలిస్తున్నారు. ఏం చెప్పినా.. ఏది చేసినా చివరకు సారాంశం ఏంటంటే.. ఇంట్లోనే ఉండండి. బయటకు రావద్దు.

ప్ర:ఉరుకుల పరుగుల జీవితంలో లాక్​డౌన్​ మనుషుల్లో బంధాలను బలోపేతం చేస్తుందా..?

జ: చెయ్యదు. ఎందుకంటే బంధాలను బలోపేతం చేసుకోవాలనుకునేవాళ్లు ఎలాంటి పరిస్థితి ఉన్నా.. వాటిని అలాగే కొనసాగిస్తారు.

ప్ర:లాక్​డౌన్​ వల్ల ప్రజా జీవితంలో వచ్చిన మార్పేంటి..?

జ: కరోనా మనిషి ఎలాంటి పరిస్థితుల్లోనైనా బతకగలడు అని మనకు అర్థమయ్యేలా చేసింది. మనం వంద రూపాయల్లో బతకగలిగితే ఇప్పుడు 25 రూపాయల్లో కూడా బతకొచ్చు అని కరోనా చూపించింది. ఇక మీదట ఏదీ వృథా చేయకూడదు.

ప్ర: కష్టం తర్వాత సుఖం వస్తుందంటారు. ప్రస్తుత సమయంలో రాబోయే మంచి కోసం ఎదురుచూడవచ్చా..?

జ: కష్టం నుంచి గుణపాఠం నేర్చుకుంటే అది మంచిదే. ప్రస్తుత పరిస్థితి నుంచి పాఠం నేర్చకొని భవిష్యత్తులో జాగ్రత్త వహిస్తే మంచిదే. లేకుంటే కష్టమే..!

ఇదీ చూడండి: కెరీర్​ డౌన్​ అయినప్పుడల్లా.. నేను లాక్​డౌన్​లోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.