ETV Bharat / sitara

sai dharam tej: హీరో సాయిధరమ్ తేజ్ తాజా హెల్త్​ బులెటిన్ - Hero sai dharam tej news

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మెగాహీరో సాయిధరమ్ తేజ్ వైద్యానికి స్పందిస్తున్నారు. ఈ విషయాన్ని అపోలో డాక్టర్లు హెల్త్​ బులెటిన్​లో వెల్లడించారు.

Hero sai dharam tej latest health bulletin
హీరో సాయిధరమ్ తేజ్
author img

By

Published : Sep 11, 2021, 6:24 PM IST

Updated : Sep 11, 2021, 6:52 PM IST

హీరో సాయిధరమ్ తేజ్​కు సంబంధించిన తాజా హెల్త్​ బులెటిన్​ను అపోలో ఆస్పత్రి విడుదల చేసింది. వైద్యానికి స్పందిస్తున్నారని, అంతర్గత అవయవాల పనితీరు స్థిరంగా ఉందని తెలిపింది. అంతర్గత అవయవాల్లో బ్లీడింగ్ లేదని పేర్కొన్నారు. కాలర్​బోన్ గాయానికి శస్త్ర చికిత్సను 24 గంటల తర్వాత పరిశీలిస్తామని చెప్పారు.

శుక్రవారం రాత్రి హైదరాబాద్​లోని కేబుల్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో సాయి గాయపడ్డారు. దీంతో అతడిని తొలుత మెడికవర్​ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. ఆ తర్వాత అపోలో ఆస్పత్రికి మార్చి శస్త్రచికిత్స చేశారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్​కల్యాణ్​తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు సాయిధరమ్ తేజ్​ను పరామర్శించారు. మెడికవర్​ ఆస్పత్రిలో ఉన్నప్పుడు తీసిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

సాయిధరమ్ తేజ్ వీడియో

ఇవీ చదవండి:

Last Updated : Sep 11, 2021, 6:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.