ETV Bharat / sitara

'105 మినిట్స్​'లో హన్సిక ఏకపాత్రాభినయం - హన్సిక 105 మినిట్స్​

కథానాయిక హన్సిక ఏకపాత్రాభినయం చేసిన చిత్రం '105 మినిట్స్​'. ఎడిటింగ్​ లేకుండా సింగిల్​ షాట్​లో కేవలం ఆరు రోజుల్లోనే రూపొందించిన చిత్రమిది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం విలేకర్లతో ముచ్చటించింది.

Hansika's One Not Five 105 Minutes Movie Press Meet
హన్సిక ఏకపాత్రిభినయ చిత్రం.. '105 మినిట్స్​'
author img

By

Published : Aug 19, 2021, 7:31 AM IST

Updated : Aug 19, 2021, 7:44 AM IST

ఒకే ఒక్క పాత్రలో ఎడిటింగ్​ లేకుండా సింగిల్​ షాట్​లో చిత్రీకరించిన చిత్రం '105 మినిట్స్​'. హన్సిక ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాను రాజు దుస్సా తెరకెక్కించారు. బొమ్మన్​ శివ నిర్మించారు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్​లో​ విలేకర్ల సమావేశం నిర్వహించింది చిత్రబృందం. ఈ కార్యక్రమంలో హీరోయిన్​ హన్సిక మాట్లాడుతూ.. "నేనిప్పటి వరకు చేసిన సినిమాల్లో సవాల్​గా అనిపించిన చిత్రమిదే"నని చెప్పారు.

Hansika's One Not Five 105 Minutes Movie Press Meet
హన్సిక

"సినిమాలోని ప్రతి షాట్​ ఇరవై నిమిషాల పైన ఉన్నా.. హన్సిక నో అనకుండా చేసింద"ని అన్నారు దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ.."ఆరు రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేశాం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ"ని తెలిపారు. ఈ చిత్రానికి సామ్​ సి.యస్​ సంగీతాన్ని సమకూర్చగా.. కిషోర్​ బోయిదాపు సినిమాటోగ్రాఫర్​గా వ్యవహరించారు.

ఇదీ చూడండి.. 'హీరో వెంకటేశ్​తో నా ప్రతి సినిమా గురించి చర్చిస్తా!'

Last Updated : Aug 19, 2021, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.