ETV Bharat / sitara

ఈ చిత్రాన్ని తీయడానికి కారణమదే: అరణ్య డైరెక్టర్​ - అరణ్య సినిమా

పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తన వంతు బాధ్యతగా 'అరణ్య' సినిమా తెరకెక్కించినట్లు దర్శకుడు ప్రభు సాల్మాన్ స్పష్టం చేశారు. అడవుల విస్తరణకు ఎంతగానో దోహదపడే ఏనుగుల ఉనికి రోజురోజుకు ప్రశ్నార్థకమవుతుందని.. వాటి ప్రాధాన్యతను వివరించేందుకే 'ఏనుగు' అంశాన్ని ప్రధానంగా తీసుకున్నట్లు 'ఈటీవీ భారత్'కు వివరించాడు.

haathi mere saathi movie director prabhu salman special interview
'సామాజిక స్పృహతో 'అరణ్య' చిత్రాన్ని రూపొందించాం'
author img

By

Published : Feb 16, 2020, 3:10 PM IST

Updated : Mar 1, 2020, 12:45 PM IST

దేశంలో ఏనుగుల సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుందని విచారం వ్యక్తం చేశాడు దర్శకుడు ప్రభు సాల్మాన్​. ప్రతి రోజు 50 కి.మీ నడుస్తూ వాటి పేడతో అడవుల వృద్ధికి ఉపయోగపడే ఏనుగులు.. పట్టణీకరణ ప్రభావంతో ఎలాంటి బాధలు అనుభవిస్తున్నాయి. వాటి మనుగడ కోసం అడవిని సృష్టించిన జాదవ్ ప్రియాంక్ ఏం చేశాడనేది సినిమాలో చూపించబోతున్నట్లు దర్శకుడు తెలిపాడు. ఈరోజ్ ఇంటర్నేషనల్ పతాకంపై రానా, విష్ణు విశాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 2న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

దర్శకుడు ప్రభు సాల్మోన్​తో ఈటీవీ భారత్​ ప్రత్యేక ఇంటర్వ్యూ

నిజ జీవిత పాత్ర ఆధారంగా..

అసోంలో జరిగిన ఓ వ్యక్తి నిజ జీవితం ఆధారంగా 'అరణ్య'ను తెరకెక్కించారు. అతడి పేరు జాదవ్‌ ప్రియాంక్‌. తన జీవిత కాలంలో దాదాపు 1300 ఎకరాల్లో అడవిని పెంచారు. దీని వల్ల అక్కడి భూమి నది కోతకు గురవ్వకుండా చెట్లు సంరక్షిస్తున్నాయి. 2015లో ఆయనకి 'పద్మశ్రీ' పురస్కారం దక్కింది.

ఇదీ చూడండి.. 'అరణ్య'లో లీడర్​ ఏనుగుకు ఆడిషన్​!

Last Updated : Mar 1, 2020, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.