జాకీ ష్రాఫ్ నుంచి అనిల్ కపూర్ వరకు మొత్తంగా ఏడుగురు బాలీవుడ్ నటులు తమ ఫిట్నెస్ విషయంలో ఎక్కడా తీసిపోరు. తమదైన శైలిలో తరచు వ్యాయామం చేస్తూ ఫిట్నెస్ను కాపాడుకుంటున్నారు. వయసు కేవలం అంకె మాత్రమే అని రుజువు చేస్తున్నారు. 60 ఏళ్లు దాటినా వీళ్లు ఇంత ఫిట్‌గా ఎలా ఉన్నారో తెలుసుకుందాం..
1. అనిల్ కపూర్
షర్టు లేకుండా బీచ్‌లో నడుస్తూ ఓ ఫోటో దిగి ఇటీవలె తన సామాజిక మాధ్యమాల ఖాతాల్లో పంచుకున్నారు నటుడు అనిల్ కపూర్. 'ఈ వ్యక్తి ప్రవచనాలు చెప్పడు. కేవలం తన షర్టు విప్పేసి బీచ్‌లో అలా సరదాగా నడుస్తూ ఉంటాడు ' అని తన ఫిట్నెస్ కనబడేలా పెట్టిన ఫోటోకి ఈ కామెంట్ జోడించారు.
63 ఏళ్ల వయసులోనూ అనిల్ కపూర్ ఇంత ఫిట్‌గా కనిపించడానికి చాలా కారణాలు ఉన్నాయి. తను రోజూ రన్నింగ్, సైక్లింగ్, జంపింగ్ రోప్స్, వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటారు. అప్పుడప్పుడూ సరదాగా తన అభిమానులకూ ఫిట్నెస్ ఛాలెంజ్‌లు విసురుతుంటారు.
2. రజనీకాంత్
'ఇన్ టూ ది వైల్డ్ విత్ బియర్ గ్రిల్స్' షూటింగ్ సమయంలో రజనీకాంత్ తన ఫిట్నెస్ ఎనర్జీతో అందరినీ ఆశ్చర్యపరిచారు. 69 ఏళ్ల వయసున్నా కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్‌లో బియర్ గ్రిల్స్‌తో కలిసి ఉల్లాసంగా షూటింగ్లో పాల్గొన్నారు. గతేడాది 'దర్బార్' షూటింగ్ సమయంలో కండలు చూపిస్తూ అలరించిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమాలో నటించిన సమయంలో రజనీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. ఫిట్నెస్ వర్కౌట్స్ మాత్రమే కాక రజనీ యోగా, స్విమ్మింగ్ కూడా చేస్తారు.
3. సన్నీ దేఓల్
'ఫిట్నెస్ అనేది ఒక వ్యసనం. కనీసం రోజుకు రెండు మూడు గంటలైనా వ్యాయామం చేయకపోతే రోజు గడవదు. పొద్దున జిమ్‌లో గడిపి, మధ్యాహ్నం ఆటలు ఆడుతుంటా ' అని చెబుతున్నారు ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు సన్నీ దేఓల్. 'దాయ్ కిలో కా హాత్' అనే చిత్రంతో ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు సన్నీ. ఇటీవలె సన్నీ తన 64వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు.
4. అమితాబ్ బచ్చన్
చాలా సినిమాల్లో నటించడమే కాకుండా 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమంతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన అమితాబ్ బచ్చన్ సూపర్ ఫిట్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 78 ఏళ్ల వయసులోనూ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు చేశారు అమితాబ్. తన సొంత బ్లాగ్ పోస్ట్‌లోనూ అమితాబ్ జిమ్‌తో రోజును ప్రారంభించాలని, యోగా చేయాలని, ప్రాణాయామం చాలా అవసరమని పేర్కొన్నారు.
5. అనుపమ్ ఖేర్
బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, పుష్ అప్స్ చేస్తూ లాక్డౌన్లో ఫిట్నెస్ చిట్కాలు చెప్పారు నటుడు అనుపమ్ ఖేర్. 65 ఏళ్ల అనుపమ్ తను ఫిట్‌గా ఉండేలా ప్రోత్సహించే అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్ కు ధన్యావాదాలు తెలిపారు. 2016లో ఒకేసారి 14 కిలోలు తగ్గి అభిమానులను ఆశ్చర్యపరిచాడు అనుపమ్.
6. జాకీ ష్రాఫ్
కండల వీరుడిగా టైగర్ ష్రాఫ్ అందరికీ సుపరిచితుడే. కానీ, 63 ఏళ్లున్న అతడి తండ్రి జాకీ ష్రాఫ్ కూడా సూపర్ ఫిట్నెస్తో ఉంటారు. ఇటీవలె తన కండలు చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఓ ఫొటో షేర్ చేశారు. నెలకు కనీసం 15 రోజులైనా వ్యాయమంతోపాటు యోగా చేస్తారు. ప్రస్తుతం, అక్షయ్ కుమార్ నటిస్తోన్న 'సూర్యవంశీ' సినిమాలో ష్రాఫ్ నటిస్తున్నారు.
7. పునీత్ ఇస్సార్
బీఆర్ చోప్రా తీసిన మహాభారతంలో దుర్యోధనుడి పాత్ర పోషించిన పునీత్ ఇస్సార్ చాలా ఫిట్‌గా ఉంటారు. ఇస్సార్ వయసు 60 ఏళ్లు. లాక్డౌన్ కాలంలో తన గ్యారేజ్‌ను జిమ్‌లా మార్చి ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేశారు. ఈ జిమ్‌ను ఐరన్ ప్యారడైజ్ పిలుస్తుంటాడరు. తరచుగా స్విమ్మింగ్, సూర్య నమస్కారాలు, వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంటారు.
ఇదీ చదవండి:'హైపర్ ఆది'కి ఆ పేరెలా వచ్చిందంటే?