ETV Bharat / sitara

లిమ్కా బాటిల్స్​తో మెలోడీ.. ఆయన సృష్టే - drums sivamani birthday special

భారతీయ సంగీత ప్రపంచాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి అనేకమంది అంతరంగాల్ని స్పృశించిన విఖ్యాత కళాకారుడు 'డ్రమ్స్' శివమణి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.

siva mani
శివమణి
author img

By

Published : Dec 1, 2020, 5:31 AM IST

ఆ వాద్యం హృద్యం. రసికజన నైవేద్యం. గుండెల్లో మార్మోగే సంగీత నాదం. ఆ వాద్యం వింటుంటే.. శ్రోతలు పూనకాలతో ఊగిపోతారు. సర్వం మరిచి స్వర్గసీమలో తేలియాడుతారు. మెస్మరైజ్‌ చేసే ఆ వాద్య రసధునిలో తలారా స్నానిస్తారు. శిశుర్వేత్తి... పశుర్వేత్తి... అన్న ఆర్యోక్తికి అసలు సిసలైన సంగీతానువాదం ఆయన శైలి. ఆయనే 'డ్రమ్స్‌ శివమణి'. డ్రమ్స్, ఆక్టోబాన్, దర్బుకా, ఉడుకాయి, కంజరలతో పాటు మరికొన్ని సంగీత వాద్యాలను వాయిస్తారు. మంగళవారం(డిసెంబరు 1) ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర అంశాలు మీ కోసం

ఐపీఎల్‌ ద్వారా గుర్తింపు

2008, 2010 ఐపీఎల్‌‌లో శివమణి డ్రమ్స్‌ వాయించారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఈయనకు అనుబంధం ఉంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సారథ్యంలో సంగీత సాధనాలు వాయించినందుకు శివమణికి ఎక్కువ గుర్తింపు లభించింది. ఏఆర్‌ రెహమాన్, శివమణి చిన్ననాటి స్నేహితులు.

siva mani
శివమణి

కుటుంబ నేపథ్యం

శివమణి చెన్నైకి చెందినవారు. ఏడు సంవత్సరాల నుంచే డ్రమ్స్‌ వాయించడం మొదలుపెట్టారు. 11 ఏళ్ల నుంచి సంగీతాన్ని వృత్తిగా స్వీకరించారు. ఆ తర్వాత ముంబయికి మకాం మార్చారు. నోయెల్‌ గ్రాంట్, బిల్లే కోభామ్‌ల నుంచి స్ఫూర్తి పొందారు. ఎం.ఎస్‌.విశ్వనాథన్, ఇళయరాజా, ఏ.ఆర్‌.రెహమాన్‌ తదితరులతో కలిసి పనిచేశారు. 1990లో బిల్లే కోభామ్‌తో ముంబయిలోని రంగ్‌ భవన్ వేదికను పంచుకున్నారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనకు గాడ్‌ ఫాదర్ అని మణి చెబుతుంటారు.‌

కర్ణాటక సంగీతంలోనూ అసమాన ప్రతిభ

కర్ణాటక సంగీత విద్వాంసులు కున్నాకుడి వైద్యనాథన్, టీవీ గోపాల్‌కృష్ణన్, వల్లీయాపట్టి సుబ్రమణ్యం, పళణివేల్‌, ఎల్‌.శంకర్‌లతో మొదట సంగీత ప్రయోగాలను చేసేవారు శివమణి. కెరీర్‌ తొలి దశలో కోలీవుడ్‌ నటుడు, నిర్మాత, దర్శకుడైన టీ రాజేందర్‌తో చాలాసార్లు పనిచేశారు. ముంబయిలో కచేరీలో తబలా విద్యాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ తనతో త్రిలోక్‌ గుర్తుతో వేదికను పంచుకోవాలని ఆహ్వానించారు. అప్పటి నుంచి శివమణి లూయిస్‌ బ్యాంక్స్‌తో సహా ఎందరో సంగీత విద్వాంసులతో కలిసి పనిచేశారు.

ఏ.ఆర్‌.రెహమాన్‌తో కలిసి ఎన్నో ప్రపంచస్థాయి ప్రదర్శనలు ఇచ్చారు. ఆయనతో కలిసి 'బొంబాయి డ్రీమ్స్‌'కు పని చేశారు. శ్రద్ధా సంగీత బృందంలో శివమణి భాగస్వాములు. ఈ బృందంలో శంకర్‌ మహదేవన్, హరిహరన్, యూ.శ్రీనివాస్, లాయ్‌ మెన్డోన్సాలు ఉన్నారు.

siva mani
శివమణి

ఏషియా ఎలెక్ట్రిక్​ బ్యాండ్​ వ్యవస్థాపకుడు

శివమణికి ఏషియా ఎలెక్ట్రిక్​ బ్యాండ్‌ ఉంది. ఈ సంగీత బృందంలో నీలాద్రి కుమార్, లూయిస్‌ బ్యాంక్స్, రవి చారిలు సభ్యులుగా పనిచేస్తున్నారు. 'సిల్క్‌ అండ్‌ శ్రద్ధ' ప్రపంచ సంగీత బ్యాండ్‌కు కూడా శివమణి సభ్యుడిగా ఉన్నారు.

తమిళనాడుకు చెందిన చాలామంది సంగీత దర్శకులతో శివమణి పనిచేశారు. రోజా, రంగ్‌ దే బసంతి, స్వదేశ్‌, తాల్‌, లగాన్‌, దిల్‌ సే, గురు, కాబుల్‌ ఎక్స్‌ ప్రెస్‌, రాక్‌ స్టార్‌ సినిమాలకు డ్రమ్స్‌ వాయించారు. కాదల్‌ రోజవే (తెలుగులో నా చెలి రోజా), చయ్య చయ్య పాటలకు పనిచేశారు. తెలుగు సినిమాలు పడమటి సంధ్య రాగం, సిరివెన్నెలలో నటించారు. 2016లో బాలీవుడ్​ సినిమా 'మదారి'లోనూ కనిపించారు.

siva mani
శివమణి

లిమ్కా బాటిల్స్‌తో మెలోడీ

దుబాయ్, మాస్కో, న్యూయార్క్, టొరంటో తదితర ప్రదేశాలలో శివమణి ప్రదర్శన ఇచ్చారు. 2005లో జరిగిన ముంబయి ఫెస్టివల్​లోనూ ప్రఖ్యాత దిగ్గజ శీతల పానీయ సంస్థ కోకాకోలా వారు లిమ్కా ఫ్రెష్‌ ఫేస్‌ ఈవెంట్‌లో ప్రదర్శన ఇవ్వమని ఆయన్ను ఆహ్వానించారు. ఆ వేడుకలో లిమ్కా బాటిల్స్‌తో శివమణి మెలోడీ సృష్టించారు. కార్టూన్‌ నెట్​వర్క్‌, పోగో ఛానల్‌లో గాలీ సిమ్‌ సిమ్‌ అనే విద్యా సంబంధిత కార్యక్రమానికి కూడా శివమణి పనిచేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పురస్కారాలు

2009లో కళారంగంలో అత్యున్నత రాష్ట్ర గౌరవమైన కలైమమణి బిరుదును తమిళనాడు ప్రభుత్వం శివమణికి ప్రదానం చేసింది. 2019లో పద్మశ్రీ వరించింది.

ఆల్బమ్స్‌

1994లో కర్ణాటిక్ సంగీత ప్రయోగాత్మకమైన గోల్డెన్‌ కృతిస్‌ కలర్స్‌ ఆల్బమ్​కు ఏ.ఆర్‌.రెహమాన్, జాకీర్‌ హుస్సేన్, శ్రీనివాసన్, కున్నాకుడి వైద్యనాథన్​లతో కలిసి పనిచేశారు శివమణి. ఆ తర్వాత 2000లో ప్యూర్‌ సిల్క్‌, కృష్ణ కృష్ణ, 2003లో డ్రమ్స్‌ ఆన్‌ ఎర్త్‌, కాష్‌, మహాలీల తదితర ఆల్బమ్స్‌కు పని చేశారు. కృష్ణ కృష్ణ అనేది యూకేలో విడుదలైన ఓ క్లబ్‌ ట్రాక్‌. ఈ ట్రాక్‌ను మలయాళ కంపోజర్‌ రాహుల్‌ రాజ్‌తో విడుదల చేశారు. కాష్‌ అనేది హరిహరన్‌తో చేసిన మొట్టమొదటి గజల్‌ ఆల్బమ్. మహాలీల ఆల్బమ్​ను శివమణికి తొలి వ్యక్తిగత ఆల్బమ్. అరిమా నంబి, కనితన్‌ సినిమాలకూ సంగీతాన్ని అందించారు. కనితన్ తెలుగులో ‌ 'అర్జున్‌ సురవరం'గా రీమేకైంది.

ఇదీ చూడండి : 'శివమణి' కరోనా క్లాస్‌.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.