వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ప్రత్యేకత చాటుకున్నారు. నటుడిగానే కాకుండా చిత్రకారుడిగా ప్రావీణ్యమున్న బ్రహ్మానందం... ఈ నవరాత్రుల కోసం ఇంట్లోనే బొజ్జ గణపయ్యను తయారు చేసుకున్నారు. మట్టి తెచ్చి అందంగా చిట్టి గణపయ్యను సృష్టించారు. కరోనా నుంచి ప్రపంచాన్ని గట్టెక్కించాలని ప్రార్థించారు.
యువ కథానాయకుడు విశ్వక్ సేన్ కూడా పసుపుముద్దతో లంబోధరుడ్ని తయారు చేసి భక్తిభావాన్ని చాటుకున్నాడు. ప్రజలంతా ఇళ్లలోనే మట్టి గణపయ్యలను తయారు చేసుకుని పూజించాలని కోరాడు.
ఇది చూడండి మెగాస్టార్ ఇండస్ట్రీకి రావడానికి కారణం ఆయనే!