ETV Bharat / sitara

'భీమ్లానాయక్‌' రిలీజ్‌.. కళాశాలకు హాలీడే.. స్పందించిన ఏపీ ప్రభుత్వ విభాగం - pawan rana bheemla nayak

పవన్ 'భీమ్లా నాయక్' రిలీజ్ సందర్భంగా కాలేజీకి సెలవిచ్చారంటూ వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆ ప్రకటన అవాస్తవమంటూ క్లారిటీ ఇచ్చింది.

bheemla nayak movie
భీమ్లా నాయక్ మూవీ
author img

By

Published : Feb 24, 2022, 3:23 PM IST

తెలుగు రాష్ట్రాల్లో పవర్‌స్టార్‌ మేనియా మొదలైపోయింది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'భీమ్లానాయక్‌' శుక్రవారం రిలీజ్‌ కానున్న సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. మొదటిరోజే తమ అభిమాన హీరో సినిమా చూడాలనుకుంటున్నామంటూ పోస్టులు పెడుతున్నారు.

bheemla nayak release
భీమ్లా నాయక్ మూవీ

మరోవైపు కళాశాలలు ఉండటం వల్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షోకు వెళ్లలేకపోతున్నామని పలువురు విద్యార్థులు కాస్త నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రా విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఓ ప్రకటన నిన్నటి నుంచి వాట్సాప్‌లో వైరల్‌గా మారింది. విద్యార్థుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని 'భీమ్లానాయక్‌' విడుదల సందర్భంగా శుక్రవారం ఆంధ్రా యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ సెలవు ప్రకటిస్తున్నట్లు అందులో ఉంది.

ఇది నిజమా? కాదా? అని పలువురు విద్యార్థులు సందేహం వ్యక్తం చేయగా.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి సంబంధించిన 'ఫ్యాక్ట్‌చెక్‌' సెల్‌ అది అబద్ధమని తేల్చేసింది. ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ ఈ విషయంపై స్పందిస్తూ.. "కొత్త సినిమా విడుదల సందర్భంగా శుక్రవారం సెలవు ప్రకటించినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సెలవును ప్రకటిస్తూ మేం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఆ ప్రకటన అవాస్తవం మాత్రమే" అని తెలిపారు. ఈ విషయాన్ని FACTCheck.AP.Gov.in ట్వీట్‌ చేసింది.

ap govt notice
ఏపీ ప్రభుత్వం స్పందన
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.