ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్.. సొంత భాషలో నటించకపోవడానికి గల కారణాన్ని వెల్లడించింది. అ విషయాన్ని ఇటీవలే ఓ ఇంగ్లీష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకుంది.
మలయాళంలో 'ప్రేమమ్'(2015) సినిమాతో అరంగేట్రం చేసింది అనుపమ. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీ అయిపోయింది. కానీ ఇన్నేళ్లలో సొంత భాషలో మరో చిత్రం మాత్రమే చేసింది.
"ప్రేమమ్' విడుదలకు ముందు చాలా ఇంటర్వ్యూలో పాల్గొన్నా. సినిమా విడుదల తర్వాత నా పాత్ర వ్యవధి తక్కువ ఉందని తెలిసిన తర్వాత కొందరు నాపై ట్రోలింగ్ చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ప్రచారం చేసుకున్నానని అన్నారు. అప్పుడే మాలీవుడ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా" -అనుపమ పరమేశ్వరన్, కథానాయిక