ETV Bharat / sitara

బిగ్​బీ ఇంటి నుంచి మరో హీరో! - సినిమాల్లోకి అమితాబ్​ మనవడు

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్​ ఇంట్లో అందరూ సినిమా పరిశ్రమకు సంబంధం ఉన్నవాళ్లే. తాజాగా, ఆయన మనవడు అగస్త్య నందా హీరోగా పరిచయమయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Another heir to the cinema from amitab bachan house?
బిగ్​బీ ఇంటి నుంచి సినిమాల్లోకి మరో వారసుడు?
author img

By

Published : Jul 11, 2020, 6:54 AM IST

ప్రస్తుతం బాలీవుడ్‌లో బంధుప్రీతి హాట్‌ టాపిక్‌గా మారింది. చిత్రపరిశ్రమలో ప్రముఖుల వారసులకే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయని, సినీ నేపథ్యం లేని వారికి ప్రోత్సాహం అందట్లేదని ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరోవైపు వారసుల కుటుంబాల సినీరంగ ప్రవేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్‌ మెగాస్టార్​ అమితాబ్‌ బచ్చన్‌ ఇంటి నుంచి మరో వ్యక్తి వెండితెరకు పరిచయం కాబోతున్నట్లు సమాచారం.

బిగ్​బీ కుటుంబంలో దాదాపు అందరూ నటులే. ఆయన సతీమణి జయా బచ్చన్‌ అప్పట్లో సనిమాల్లో మెప్పించారు. అమితాబ్‌ కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌.. కోడలు ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ కూడా సినీ లోకాన్ని ఏలుతున్నారు. ఇప్పుడు ఆయన మనవడు, కుమార్తె శ్వేతా బచ్చన్‌ నందా కుమారుడు అగస్త్య నందా హీరోగా మారబోతున్నాడట. చిన్నతనం నుంచే అతడికి సినిమాల్లోకి రావాలని కోరిక ఉందట. అమితాబ్‌ బచ్చన్‌ మనవడు కావడం.. సోషల్‌మీడియాలోనూ అగస్త్య నందాకు మంచి ఫాలోయింగ్‌ ఉండటం వల్ల సినిమా అవకాశాలు వరసకడుతున్నాయి.

amitab bachan
amitab bachan

ప్రస్తుతం అగస్త్య సినిమా కథలు వింటున్నాడని, ఏదైన కథ నచ్చితే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని బీటౌన్ వర్గాల సమాచారం మరోవైపు, అగస్త్య సోదరి, అమితాబ్‌ మనవరాలు నవ్య నవేలీ నందా మోడల్‌గా రాణించడం సహా, ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవలు అందించేందుకు సంస్థను ఏర్పాటు చేసింది.

ఇదీ చూడండి:'మాస్క్​'ను హిందీలో ఏమంటారో చెప్పిన అమితాబ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.