లాక్డౌన్ కారణంగా ఇంటివద్దే సమయాన్ని గడుపుతున్నారు సినీతారలు. అల్లు శిరీష్ తన సోదరుడు అల్లు అర్జున్ పిల్లలతో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ వీడియోను అర్జున్ సతీమణి స్నేహ "ఫన్ విత్ సిరి బాబాయ్" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ వీడియోలో అర్హ, అయాన్ చాలా క్యూట్‌గా స్టెప్పులు వేశారు.
స్నేహారెడ్డి షేర్ చేసిన ఈ వీడియోపై శిరీష్ స్పందించాడు "2020లో అంకుల్ విధులు ఇవే.. పిల్లలతో టిక్‌టాక్‌లు చేయించడం కూడా అందులో ఒకటి" అని కామెంట్ పెట్టాడు.
శిరీష్ నటించిన చివరి చిత్రం 'ఏబీసీడీ'. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఇప్పటివరకు ఈ హీరో తన తదుపరి చిత్రానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">