ETV Bharat / sitara

Valimai Review: అజిత్​ 'వలిమై' రివ్యూ.. ఎలా ఉందంటే? - వలిమై రిలీజ్​ డేట్​

తమిళ స్టార్​ హీరో అజిత్​ నటించిన 'వలిమై' సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తెలుగు యువ హీరో కార్తికేయ విలన్​గా నటించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అభిమానులను ఆకట్టుకుందా అనేది తెలుసుకోవాలంటే ఈ రివ్యూ చదివేయండి..

valimai review
వలిమై రివ్యూ
author img

By

Published : Feb 24, 2022, 2:19 PM IST

చిత్రం: వలిమై; నటీనటులు: అజిత్‌, కార్తికేయ, హ్యుమాఖురేషి, బని, యోగిబాబు, సుమిత్ర తదితరులు; సినిమాటోగ్రఫీ: నీరవ్‌ షా; ఎడిటింగ్‌: విజయ్‌ వేల్‌కుట్టి; సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా, జిబ్రాన్‌(నేపథ్య); నిర్మాత: బోనీ కపూర్‌; రచన, దర్శకత్వం: హెచ్‌.వినోద్‌; విడుదల: 24-02-2022; బ్యానర్‌: జీ స్టూడియోస్‌, బేవ్యూ ప్రాజెక్ట్స్‌ ఎల్‌ఎల్‌పీ

క‌రోనా ఉద్ధృతి త‌గ్గుముఖం ప‌ట్ట‌డం వల్ల.. వేస‌వి వినోదాల‌ సీజ‌న్ ఈసారి కాస్త ముందుగానే మొద‌లైంది. థియేట‌ర్లు పూర్తిస్థాయిలో తెర‌చుకోవ‌డంతో.. ఇన్నాళ్లూ ఊరిస్తూ వ‌చ్చిన అగ్ర‌తార‌ల చిత్రాల‌న్నీ ఒక్కొక్కటిగా బాక్సాఫీస్ ముందుకు వ‌రుస క‌డుతున్నాయి. అలా ఈ వారం మొద‌టగా ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన చిత్రం ‘వ‌లిమై’(Valimai). త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు అజిత్(ajith) న‌టించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. ‘ఖాకీ’ ఫేం హెచ్‌.వినోద్ తెర‌కెక్కించారు. తెలుగు యువ హీరో కార్తికేయ ప్ర‌తినాయ‌కుడిగా న‌టించారు. అజిత్‌ బైక్ రేసింగ్ ఇమేజ్‌కు త‌గ్గ క‌థాంశం కావ‌డం.. ప్ర‌చార చిత్రాల్లో ప‌సందైన యాక్ష‌న్ హంగామా క‌నిపించ‌డంతో సినిమాపై సినీ ప్రియుల్లో మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి ఆ అంచ‌నాల‌ను ‘వ‌లిమై’ అందుకుందా?(Valimai Review) అజిత్, కార్తికేయ‌ల యాక్ష‌న్ ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా?

క‌థేంటంటే: మాద‌క‌ద్ర‌వ్యాల (డ్ర‌గ్స్‌)తో ఉన్న ఓ ఓడ కొలంబియా నుంచి భార‌త్‌లోని ఒడిశా తీరానికి చేరుకోవ‌డంతో క‌థ మొద‌ల‌వుతుంది. ఆ స‌ర‌కును విశాఖ‌ప‌ట్నంకు చేర్చి అక్క‌డ యువ‌త‌కు అక్ర‌మంగా విక్ర‌యించే ప్ర‌య‌త్నం చేస్తుంటుంది ఓ ముఠా. ఆ స‌ర‌కు వైజాగ్ తీసుకొస్తుండ‌గా.. సైతాన్ స్లేవ్స్ అనే బైక్ రేసింగ్ ముఠా దాన్ని కొట్టేస్తుంది. దీనికి నాయ‌కుడు న‌రేన్ (కార్తికేయ‌) . నిరుద్యోగ యువ‌తకు మాయ మాట‌లు చెప్పి.. నేరవృత్తి వైపు ఆక‌ర్షించేలా చేసి, వాళ్ల‌తో భ‌యంక‌ర‌మైన నేర‌సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా డ్ర‌గ్స్ విక్ర‌యం, చైన్ స్నాచింగ్‌, దోపిడీలు హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌టం ఈ ముఠా ప‌ని. వాళ్ల అకృత్యాలు అంత‌కంత‌కూ పెరిగిపోవ‌డంతో.. వాళ్ల ఆట‌క‌ట్టించేందుకు ఏసీపీ అర్జున్ (అజిత్‌)(ajith)ను రంగంలోకి దించుతుంది పోలీస్ డిపార్ట్‌మెంట్‌. స్వ‌త‌హాగా బైక్ రేస‌ర్ అయిన అత‌ను సైతాన్ స్లేవ్స్ గ్యాంగ్ అరాచ‌కాల‌ను ఎలా అడ్డుకున్నాడు? ఈ క్ర‌మంలో అత‌నికెదురైన స‌వాళ్లేంటి? ఈ పోరాటంలో అర్జున్‌కు సోఫియా (హ్యూమా ఖురేషి) ఎలా స‌హాయ‌ప‌డింది? అన్న‌ది తెర‌పై చూడాలి.(Valimai Review)

ఎలా ఉందంటే: బైక్ రేసింగ్ నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ క‌థ‌లు మ‌న ద‌గ్గ‌ర చాలా త‌క్కువే. ఆ లోటును వ‌లిమై కాస్త తీర్చింది(Valimai Review). స్వ‌త‌హాగా బైక్ రేస‌ర్ అయిన అజిత్‌తో ఇలాంటి క‌థ‌తో సినిమా చేయ‌డమంటే ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు నెల‌కొని ఉంటాయి. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ క‌థ‌ను ఆద్యంతం అదిరిపోయే ఛేజింగ్ ఎపిసోడ్ల‌తో ముస్తాబు చేశాడు ద‌ర్శ‌కుడు వినోద్. సైతాన్ స్లేవ్స్ గ్యాంగ్ దోపిడీలు, హ‌త్య‌లు చేసే ఎపిసోడ్ల‌తో సినిమాని ప్రారంభించిన తీరు ఆస‌క్తిరేకెత్తిస్తుంది. ఈ క్ర‌మంలో వ‌చ్చే బైక్ రేసింగ్ సీక్వెన్స్ ఆక‌ట్టుకుంటాయి. ఆ వెంట‌నే అదిరిపోయే యాక్ష‌న్ ఎపిసోడ్‌తో అజిత్ పాత్ర‌ను ప‌రిచయం చేసిన తీరు మెప్పిస్తుంది. అయితే ఆయ‌న కుటుంబ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాలు క‌థా వేగానికి ఒక్క‌సారిగా బ్రేక్‌లు వేస్తాయి. అర్జున్ విశాఖలో అడుగు పెట్టిన త‌ర్వాత నుంచి క‌థ చ‌క‌చ‌కా సాగిపోతుంది. ఓ యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌ను ఆధారంగా చేసుకుని.. దాని వెన‌కున్న సైతాన్ స్లేవ్స్ గ్యాంగ్‌ను, వాళ్ల గేమ్ ప్లాన్‌ను అర్జున్‌ తెలుసుకునే తీరు మ‌రీ సినిమాటిక్‌గా ఉంటుంది. అయితే ఆ త‌ర్వాత నుంచి క‌థ మ‌రోస్థాయికి వెళ్తుంది. సైతాన్ స్లేవ్స్ గ్యాంగ్‌ను ప‌ట్టుకునే క్ర‌మంలో వ‌చ్చే ఛేజింగ్ ఎపిసోడ్లు, బైక్ స్టంట్స్ క‌నులవిందుగా ఉంటాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్ర‌ధ‌మార్ధంలో క‌థకు త‌గ్గ‌ట్లుగా సినిమాని ఆస‌క్తిక‌రంగా ముందుకు తీసుకెళ్లిన ద‌ర్శ‌కుడు ద్వితీయార్ధంలో పూర్తిగా త‌డ‌బ‌డ్డాడు. సీరియ‌ల్ త‌ర‌హాలో సాగే ఫ్యామిలీ డ్రామా ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంటుంది. ముఖ్యంగా మ‌ద‌ర్ సెంటిమెంట్ ఎపిసోడ్లు చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. ఇక ముగింపుకు ముందు అజిత్ పోలీస్ ట్రెజ‌రీ నుంచి డ్ర‌గ్స్ కొట్టేసే స‌న్నివేశాలు, ఈ క్ర‌మంలో వ‌చ్చే బైక్‌ రేసింగ్ ఎపిసోడ్‌లు, ఆఖ‌ర్లో ఆయ‌న‌కు కార్తికేయ‌ కు మ‌ధ్య వ‌చ్చే యాక్ష‌న్ స‌న్నివేశాలు చూపు తిప్పుకోనివ్వ‌కుండా చేస్తాయి.

ఎవ‌రెలా చేశారంటే: ఏసీపీ అర్జున్ పాత్ర‌లో అజిత్ అద్భుతంగా ఒదిగిపోయారు. ఆయ‌న స్వ‌త‌హాగా బైక్ రేస‌ర్ కావ‌డంతో.. ఆ ఇమేజ్ ఈ క‌థ‌కు చాలా ప్ల‌స్ అయింది. బైక్ ఛేజింగ్‌, యాక్ష‌న్ ఎపిసోడ్ల‌లో ఆయ‌న న‌ట‌న అంద‌రినీ ఆక‌ట్ట‌కుంటుంది. అయితే గ‌తంతో పోల్చితే ఆయ‌న ఈ సినిమాలో కాస్త లావుగా క‌నిపించారు. హ్యూమా ఖురేషి పాత్ర‌కు క‌థ‌లో మంచి ప్రాధాన్య‌మిచ్చారు. ఆరంభంలో ఆమెకు కొన్ని మంచి ఎలివేష‌న్ షాట్లు ప‌డ్డాయి. ఈ చిత్రంతో ఆమెకు మ‌రిన్ని యాక్ష‌న్ పాత్ర‌లు లభించే అవ‌కాశ‌ముంది. ఇక ప్ర‌తినాయ‌కుడిగా కార్తికేయ(Kartikeya)ను చూపించిన విధానం బాగుంది. ఆయ‌న లుక్‌, శ‌రీరాకృతి పాత్ర‌కు నిండుత‌నాన్ని తెచ్చాయి. ప్ర‌ధ‌మార్ధంతో పోల్చితే.. ద్వితీయార్ధంలోనే ఆయ‌న‌కు ఎక్కువ స్ర్కీన్ ప్ర‌జెన్స్ ల‌భించింది. యాక్ష‌న్ ఎపిసోడ్ల‌లో అజిత్‌కు దీటైన న‌ట‌న‌తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాని ద‌ర్శ‌కుడు వినోద్ ఆరంభించిన తీరు మెప్పిస్తుంది. అయితే ప్ర‌ధ‌మార్ధంలో క‌థ‌పై చూపించిన ప‌ట్టును చివరి వరకూ కొనసాగించలేదు. క‌థ‌ను ప‌క్క‌కు నెట్టి యాక్ష‌న్ హంగామాతోనే మ్యాజిక్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో కొన్ని యాక్ష‌న్ ఎపిసోడ్‌లు మ‌రీ సాగ‌తీత‌గా అనిపించాయి. ఇక క‌థ‌లో ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఎక్క‌డా పండలేదు. దిలీప్ సుబ్బ‌రాయ‌న్ స్టంట్స్ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. జిబ్రాన్ నేప‌థ్య సంగీతం ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. నీర‌వ్ షా ఛాయాగ్ర‌హ‌ణం ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి.

బ‌లాలు

+ క‌థా నేప‌థ్యం

+ అజిత్ న‌ట‌న‌

+ యాక్ష‌న్ ఎపిసోడ్స్‌

బ‌ల‌హీన‌త‌లు

- కుటుంబ నేప‌థ్య స‌న్నివేశాలు

- ద్వితీయార్ధం

చివ‌రిగా: ‘వ‌లిమై’.. అజిత్‌ యాక్షన్‌ ప్యాక్‌.. మూవీ!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.