ETV Bharat / sitara

ఐశ్వర్యరాయ్, దీపికా పదుకొణె.. తల్లి కాబోతున్నారా? - ఐశ్వర్యరాయ్ పొన్నియన్ సెల్వన్

ప్రముఖ కథానాయికలు ఐశ్వర్య, దీపిక.. త్వరలో గుడ్​న్యూస్ చెప్పానున్నారంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నిజమెంత?

.
.
author img

By

Published : Aug 1, 2021, 4:03 PM IST

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ ఐశ్యర్యరాయ్‌, దీపికా పదుకొణెకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. లాక్‌డౌన్‌ తర్వాత సినిమా షూటింగ్​లతో బిజీగా ఉంటున్న ఈ ఇద్దరి ఫొటోలు కొన్నిరోజలుగా వైరల్​గా మారాయి. ఇప్పుడు వాటి గురించే అందరూ చర్చించుకుంటున్నారు. 'నిజం చెప్పండి మేడమ్‌' అంటూ వరుస కామెంట్లు పెడుతున్నారు.

.
.

అసలేం జరిగిందంటే?

చాలా కాలం విరామం తర్వాత ఐష్‌ కీలకపాత్రలో నటిస్తున్న దక్షిణాది చిత్రం 'పొన్నియిన్‌ సెల్వన్‌'. ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ చెన్నై పరిసర ప్రాంతాల్లో శరవేగంగా సాగుతోంది. ఈ షూట్‌లో భాగంగా తాజాగా ఐష్‌ తన భర్త అభిషేక్‌తో కలిసి చెన్నై చేరుకున్నారు. ఈక్రమంలోనే నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌తో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. వరలక్ష్మి ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. వాటిని చూసిన పలువురు నెటిజన్లు.. ఐష్‌ తల్లికాబోతుందంటూ ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా 'ఐష్‌జీ కంగ్రాట్స్‌.. త్వరగా గుడ్‌న్యూస్‌ బయట పెట్టండి' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐష్‌-అభిషేక్‌ దంపతులకు ఇప్పటికే ఆరాధ్య అనే పాప ఉంది.

మరోవైపు బీటౌన్‌ స్టార్‌ కపుల్‌ దీపికా పదుకొణె-రణ్‌వీర్‌ సింగ్‌ విషయానికి వస్తే.. కొన్నేళ్లపాటు ప్రేమించుకున్న వీరిద్దరూ 2018లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం కెరీర్‌లో దూసుకెళ్తోన్న రణ్‌వీర్‌-దీపికా తాజాగా ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రి నుంచి బయటకు వస్తూ కనిపించారు. వాటిని చూసిన పలువురు.. వాళ్లిద్దరూ త్వరలోనే శుభవార్త బయటపెట్టనున్నారని.. వైద్య పరీక్షల నిమిత్తమే ఆస్పత్రికి వచ్చారని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఈ ఫొటోలు కూడా నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.