ETV Bharat / sitara

సిగరెట్​ తాగితే అందరూ షాక్ అయ్యారు : ఆమని - ఆలీతో సరదాగా

హీరోయిన్​గా ఎన్నో మంచి పాత్రల్లో నటించిన సీనియర్​ నటి ఆమని.. తాను సిగరెట్​ తాగిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో అందరూ తనను చూసి షాక్​ అయినట్లు చెప్పారు. యువ హీరో అఖిల్​పై తనకున్న ప్రేమను తెలియజేశారు. దీంతో పాటు తన కెరీర్​లోని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

amani
ఆమని
author img

By

Published : Aug 31, 2021, 5:04 PM IST

'జంబలకిడిపంబ'తో తెలుగుతెరకు పరిచయమై, 'శుభలగ్నం'తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సీనియర్​ నటి ఆమని(Actresses Amani). కెరీర్​లో ఎన్నో మంచి పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'(alitho saradaga latest episode) కార్యక్రమానికి నటి ఇంద్రజతో కలిసి హాజరై పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. కెరీర్​లో హీరోయిన్​ అవ్వాలనే పట్టుదలతో సినీఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే తాను సిగరెట్లు తాగిన విషయమై వివరణ ఇచ్చారు.

"జంబలకిడిపంబలో ఇలాంటి సీన్స్​ ఉంటాయని డైరెక్టర్​ చెప్పలేదు. ఆయన తింగరిదానా అని పిలిచేవారు. సెట్​లో ఉన్నప్పుడు నన్ను పిలిచి 'నువ్వు ఇప్పుడు సిగరెట్​ తాగే సీన్​ ఉంది' అని చెప్పారు. నేను ఒక్కసారి స్టన్​ అయ్యాను. 'రెండు, మూడు సార్లు పీల్చు అలవాటైపోతుంది అని' అన్నారు. ఇక నేను సిగరెట్​ రెండు మూడు సార్లు పీల్చి అలవాటు చేసుకున్నాను. ఆ సీన్​ను ఒక్క టేక్​లో ఓకే చేశాను. మందు సీన్​లోనూ ఏదో ఒక జ్యూస్​ ఇవ్వమన్నాను. 'ఛాంపియన్​ బాటిల్​ ఓపెన్​ చేస్తే పొంగిపోతుంది. దాన్ని అలానే తాగాలి' అన్నారు. పక్కనే ఉన్న నరేశ్​ 'ఏమి అవ్వదు తాగేయ్​. మొదటి సినిమాలోనే ఇలాంటి అవకాశం నీకు వచ్చింది. మాకు దొరకలేదు. ఎంజాయ్​ చేయ్'​ అని కామెడీ చేశారు. అలా లైట్​గా తాగాను. ఆ తర్వాత ఓ సారి మార్నింగ్​ షూట్​ కోసం తెల్లవారుఝామున కారులో వెళ్తుండగా వాతావరణం బాగుంది. రోడ్​ సైడ్​ ఓ బడ్డి కొట్టు దగ్గర కొంతమంది పొగ పీల్చుతూ​ తాగుతూ ఎంజాయ్​ చేస్తున్నారు. నాకు కూడా తాగాలనిపిచ్చింది. అలా కారు ఆపి అక్కడి వెళ్లి సిగరెట్​ అడిగాను. వారు షాక్​ అయ్యారు. నన్ను ఎవరు గుర్తుపెట్టలేదు. అలా మరోసారి సరదాగా స్టైల్​గా స్మోక్​ చేశాను."

-ఆమని, సీనియర్​ నటి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అలా తినడమే ఇష్టం

దీంతోపాటు మామిడిపండ్లను కొనుగోలు చేసే కంటే.. దొంగలించి తింటే అందులో తియ్యదనం ఉంటుందని చెప్పింది ఆమని. "మామిడి తోటలను చూస్తే దొంగిలించి తినాలనే ఆలోచన వచ్చేస్తుంది. నేనే వెళ్లి దొంగతనంగా కాయ కోసి తింటాను. అందులో ఓ ఎంజాయ్​మెంట్​ ఉంటుంది" అని చెప్పింది.

హీరో అఖిల్​ అంటే ప్రేమ..

'సిసింద్రి' సినిమాను గుర్తుచేసుకున్న ఆమని అందులో తన కుమారిడిలా నటించిన హీరో అఖిల్​పై(hero akhil movies) తనకున్న ప్రేమను తెలిపింది. ఇప్పుడు కూడా అఖిల్​ తనను అమ్మలా భావిస్తాడని.. అలానే తాను కూడా అతడిని బిడ్డలా భావిస్తానని చెప్పుకొచ్చింది. వీరిద్దరూ త్వరలోనే తల్లీకొడుకులుగా 'మోస్ట్ ఎలిజిబుల్​ బ్యాచిలర్'(most eligible bachelor movie) ​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ​

కమర్షియల్​ దర్శకులతో పాటు కళాత్మక దర్శకులైన బాపు, కె.విశ్వనాథ్​ల సినిమాల్లోనూ ఆమని నటించారు. కెరీర్​ పీక్​లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని కొంతకాలం చిత్రాలకు దూరమయ్యారు. ఆ తర్వాత 'ఆ నలుగురు'తో రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఇటీవల 'చావు కబురు చల్లగా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి: ఆమనిని పక్కకు పిలిచి వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.