ETV Bharat / sitara

'రజినీ​ సీఎం అభ్యర్థి అయితేనే రాజకీయాల్లోకి వస్తా' - రజనీకాంత్​ న్యూస్

కోలీవుడ్​ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్​ రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టతనిచ్చారు. తాను గురువుగా భావించే సూపర్​స్టార్​ రజినీకాంత్​ సీఎం అభ్యర్థిగా ఎన్నికల్లో పాల్గొంటే తానూ రాజకీయాల్లోకి వస్తానని ట్వీట్​ చేశారు.

Actor Raghava Lawrence request Rajinikanth to reconsider his decision of political entry
'రజినీ​ సీఎం అభ్యర్థి అయితేనే రాజకీయాల్లోకి వస్తా'
author img

By

Published : Sep 14, 2020, 2:17 PM IST

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్​ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారనే వార్త ప్రస్తుతం కోలీవుడ్​లో హాట్​ టాపిక్​గా మారింది. తన గురువు సూపర్​స్టార్​ రజినీకాంత్​ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడితే తానూ కచ్చితంగా రాజకీయ ప్రవేశం చేస్తానని స్పష్టం చేశారు లారెన్స్. పార్టీలో అనుభవం ఉన్న వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తానని గతంలో రజినీ చెప్పారు. అయితే తన నిర్ణయాన్ని రజినీకాంత్​ వెనక్కి తీసుకోవాలని కోరుతూ లారెన్స్​ ట్వీట్​ చేశారు.

"నేను గతవారం ట్వీట్​ చేసిన తర్వాత చాలా మంది మీడియా స్నేహితులు అడిగారు. 'ప్రతి రాజకీయ పార్టీ మీకు సహాయం చేశారని, అందుకే మీరు వారందరినీ గౌరవిస్తున్నారని చెప్పి.. ఇప్పుడు రజినీకాంత్​కు ఎలా మీ మద్దతు తెలిపారు. ఒకవేళ రజినీకాంత్​ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటే అప్పుడు మీ మద్దతు ఎవరికి ఇస్తారు' అని ప్రశ్నించారు. సూపర్​స్టార్​కు ప్రతికూల రాజకీయాలు నచ్చవు కాబట్టి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అతనే సీఎం అభ్యర్థిగా ఉండాలని నేనూ కోరుకుంటున్నా. అయితే గతంలో రజినీ చెప్పిన నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. కానీ, ఆ విషయాన్ని హృదయపూర్వకంగా అంగీకరించలేకపోతున్నా. నేను మాత్రమే కాదు.. ఆయన అభిమానులు ఎవ్వరికైనా ఈ విషయం మింగుడు పడటం లేదని భావిస్తున్నా" అని లారెన్స్​ ట్వీట్​ చేశారు.

ఇదే విషయాన్ని అడుగుతున్నా..

సూపర్​స్టార్​ రజినీకాంత్​తో ఫోన్​ మాట్లాడిన ప్రతిసారీ సీఎం అభ్యర్థి విషయంలో పునరాలోచించుకోవాలని ఆయనకు సూచించినట్లు తెలిపారు లారెన్స్​. "ప్రతివారం రజినీకాంత్​తో మాట్లాడుతున్నప్పుడు.. ఈ విషయంపై పునరాలోచించుకోవాలని కోరుతున్నాను. ఇది జరుగుతుందని నా హృదయం చెబుతోంది. ఆయన సీఎం అభ్యర్థిగా ఉంటేనే నేను రాజకీయాల్లోకి వస్తాను. ఒకవేళ ఆయన రాకపోతే నేనూ అలాగే నా స్వచ్ఛంద సేవలను కొనసాగిస్తాను" అని​ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.