మాస్, క్లాస్ చిత్రాలు తీయడంలో దర్శకుడు పూరీ జగన్నాధ్ సిద్ధహస్తుడు. ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రాలే అందుకు ఉదాహరణ. రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ప్రస్తుతం పూరీ చేతిలో ఉంది.
ఆయన కుమారుడు హీరోగా మరో సినిమాను మొదలు పెట్టేశాడు పూరీ. కాకపోతే దర్శకత్వం తప్ప అన్ని బాధ్యతలు పూరీయే చూసుకుంటున్నాడు. ఈ సినిమాతో అనిల్ పాదూరిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు.
కుమారుడు హీరోగా ఇప్పటికే మెహబూబా చిత్రాన్ని తెరకెక్కించాడు పూరీ. ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ మాత్రం దక్కలేదు. ఈ చిత్రంతోనైనా హిట్ కొడతాడేమో చూడాలి.