ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో అదిరిపోయే ఫీచర్లు​.. యాప్​లోనే కొత్త కాంటాక్ట్స్ యాడ్, ఎడిట్​ ఆప్షన్​.. - వాట్సాప్ అడ్మిన్ రూల్స్

సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ మరో ఫీచర్​ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ అప్లికేషన్​లోనే కాంటాక్ట్స్ క్రియేట్​, ఎడిట్​ చేసుకునే అవకాశం కల్పించనుంది. మరోవైపు.. 'అప్రూవ్‌ న్యూ పార్టిసిపెంట్‌' అనే మరో కొత్త ఫీచర్​ను యూజర్ల ముందుకు తీసుకొచ్చింది. ఈ ఫీచర్ దేనికోసమంటే?

whatsapp new features 2023
whatsapp new features 2023
author img

By

Published : Apr 11, 2023, 11:41 AM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. సరికొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎప్పుడూ ముందుంటుంది. సాధారణంగా మనం తెలియనివారి మొబైల్ నెంబరు సేవ్​ చేయాలంటే వాట్సాప్​లో చేయలేం. కాంటాక్ట్స్​లో సేవ్​ చేస్తే గానీ వాట్సాప్​లోకి కొత్త నెంబరు రాదు. ఒక నంబరు అంటే ఫర్వాలేదు గానీ పదుల కొద్దీ కొత్త నెంబర్లు సేవ్​ చెయ్యాలంటే ఇబ్బందిగా ఉంటుంది. మరి ఇలాంటి వాటి కోసమే వాట్సాప్ సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. అదేంటంటే..

వాట్సాప్ అప్లికేషన్​లోనే కాంటాక్ట్స్ క్రియేట్​, ఎడిట్​ చేసుకునే సదుపాయాన్ని ఆండ్రాయిడ్​ బీటా వెర్షన్​ యూజర్లకు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. గతంలో వాట్సాప్ యూజర్లు ఏదైనా కాంటాక్ట్ సేవ్ చేసుకోవాలంటే ఫోన్ కాంటాక్ట్స్‌ యాప్​నకు వెళ్లి సంబంధిత డీటెయిల్స్ ఇచ్చి సేవ్ చేసుకోవాల్సి వచ్చేది. కొత్త ఫీచర్‌తో ఆ భారం తప్పుతుంది. నిజానికి వాట్సాప్‌లో ఫలానా కాంటాక్ట్ సేవ్ చేసుకోవడానికి ఒక షార్ట్‌కట్ ఉంది. అయితే ఈ షార్ట్‌కట్‌పై క్లిక్ చేయడం ద్వారా అది ఫోన్ కాంటాక్ట్స్‌ యాప్‌కి తీసుకెళ్తుంది. దీనివల్ల ఫోన్‌పై రెండు అప్లికేషన్లు ఓపెన్ చేయాల్సిన భారం పడుతుంది. అలాగే యూజర్లకు ఇబ్బంది కలుగుతుంది.

ఈ కొత్త ఫీచర్‌తో ఆండ్రాయిడ్ వాట్సాప్‌ వెర్షన్‌లో ఆల్రెడీ సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్‌ను ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అంటే కాంటాక్ట్స్‌ యాప్ ద్వారా చేయగలిగే ఎడిటింగ్స్‌ వాట్సాప్‌లోనే చేసుకోవచ్చు. దీనివల్ల చాలా సమయం ఆదా అవుతుంది. వాట్సాప్ కొత్త ఫీచర్‌తో వాట్సాప్ అప్లికేషన్‌ నుంచి బయటకు వెళ్లకుండా యూజర్లు వారి కాంటాక్ట్ లిస్ట్ లేదా గూగుల్ అకౌంట్‌కి కొత్త కాంటాక్ట్స్‌ను జోడించవచ్చు.

అడ్మిన్​ అనుమతితోనే గ్రూప్​లో..
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్‌ మరో ఫీచర్​ను తీసుకొచ్చింది. ఇటీవల తీసుకొచ్చిన ఓ ఫీచర్‌ గ్రూప్‌ అడ్మిన్‌లకు తమ గ్రూప్‌పై పూర్తి అధికారాన్ని ఇస్తుంది. 'అప్రూవ్‌ న్యూ పార్టిసిపెంట్‌' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో గ్రూప్‌ అడ్మిన్‌ అనుమతి లేకుండా కొత్తవారు గ్రూప్‌లో సభ్యులుగా చేరలేరు.

గతంలో గ్రూప్‌లో ఎవరైనా సభ్యులుగా చేరాలంటే.. గ్రూప్ అడ్మిన్‌ లేదా గ్రూప్‌ ఇన్వైట్‌ లింక్‌ ద్వారా చేరేందుకు అవకాశం ఉండేది. దీంతో గ్రూప్‌ ఇన్వైట్‌ లింక్‌ చాలా మంది సభ్యులుగా చేరుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రూప్‌లో సభ్యుల చేరికను అదుపు చేసేందుకు గ్రూప్‌ అడ్మిన్‌లకు కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో గ్రూప్‌ ఇన్విటేషన్‌ లింక్‌ లేదా ఇతరుల సూచన ద్వారా ఎవరైనా గ్రూప్‌లో సభ్యుల ద్వారా చేరాలంటే.. అడ్మిన్‌ అప్రూవ్‌ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లు అందుబాటులో ఉంది.

గ్రూప్‌ అడ్మిన్‌గా ఉన్నవారు గ్రూప్‌ ఇన్ఫోపై క్లిక్ చేస్తే గ్రూప్‌ సెట్టింగ్స్‌ సెక్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అప్రూవ్‌ న్యూ పార్టిసిపెంట్స్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేయాలి. తర్వాత గ్రూప్‌లో సభ్యులుగా చేరాలనుకునే వారు పంపిన రిక్వెస్ట్‌ను అడ్మిన్‌ అప్రూవ్‌ చేయాలి. అలా గ్రూప్‌లో కొత్త వారి చేరికలపై అడ్మిన్‌కు పూర్తి నియంత్రణ ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.