Whatsapp Email Verification Code : ఎప్పటికప్పుడు అదిరే అప్డేట్లతో తమ వినియోగదారులకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తుంది మెటా ఆధ్వర్యంలోని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్. తాజాగా యూజర్ అకౌంట్ వెరిఫికేషన్ కోసం ఈ-మెయిల్‌ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోనుంది. హ్యాకర్ల బారి నుంచి వినియోగదారుల గోప్యతను కాపాడటమే లక్ష్యంగా వాట్సాప్ ఈ కీలక మార్పు తీసుకువస్తున్నట్లు Wabetainfo వెబ్సైట్ వెల్లడించింది.
అనేక మార్పులతో..
Whatsapp New Features : ఇప్పటికే యూజర్స్ సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ వాట్సాప్‌లో అందుబాటులో ఉంది. ఇదే కాకుండా ఇటీవలీ కాలంలో సెక్యురిటీ పరంగా సైలెన్స్ అన్నోన్ కాలర్స్, చాట్ లాక్ వంటి అనేక మార్పులు తీసుకువచ్చింది. కాగా, ఇన్ని మార్పులు చేస్తూ వస్తున్న వాట్సాప్‌ను మాత్రం హ్యాకర్లు ఏదో విధంగా హ్యాక్ చేస్తునే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్స్‌తో తమ డెవలెప్మెంట్ టీమ్‌ను ఎప్పటికప్పుడు సన్నద్ధం చేస్తుంది మెటా సంస్థ.
త్వరలోనే అందుబాటులోకి..
Whatsapp Login Email : ఇక సెక్యురిటీ డెవలెప్మెంట్లో భాగంగా త్వరలో రానున్న నయా ఫీచర్ ఏంటంటే.. ఒక యూజర్ వాట్సాప్‌ను యాక్సెస్ లేదా అకౌంట్‌ను వెరిఫై చేయాలంటే ఈ-మెయిల్ ఐడీని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దీనిపైనే పనిచేస్తుంది వాట్సాప్. అయితే యూజర్‌ను ధ్రువీకరించడానికి తేనున్న ఈ ఈ-మెయిల్ వెరిఫికేషన్ ఆప్షన్‌ను యాప్‌లో ఆప్షనల్‌గా చేర్చనున్నారని Wabetainfo తెలిపింది. ఈ-మెయిల్ వెరిఫికేషన్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే మీ ఖాతా వెరిఫై కోసం తప్పనిసరిగా మెయిల్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లో పెట్టుకుంటే మెయిల్ లేకుండానే లాగిన్ అవ్వచ్చు. కాగా, ప్రస్తుతానికి ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉంది. యాప్‌కి సంబంధించి ఫ్యూచర్ అప్డేట్స్లో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Latest WhatsApp Feature : వాట్సాప్ యూజర్స్ ఇక నుంచి తమ సందేశాలను షార్ట్ వీడియో రూపంలో కూడా ఇతరులకు పంపవచ్చు. ఇప్పటి వరకు కేవలం టెక్ట్స్ రూపంలో మాత్రమే మెసేజ్‌లు పంపించే సౌకర్యం ఉండగా.. ఇకపై 60 సెకెన్ల నిడివితో షార్ట్ వీడియో రూపంలోనూ మెసేజ్‌లు పంపించేందుకు అవకాశం ఉంటుంది. ఈ వార్త పూర్తి కథనం కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
- ఇవీ చదవండి :
- Google Messages : వావ్! గూగుల్ మెసేజింగ్ యాప్‌తో ఇన్ని పనులు చేయొచ్చా.. మీరూ ట్రై చేయండి!
- WhatsApp New Feature : వాట్సాప్ నయా ఫీచర్.. కొత్త గ్రూప్‌లో సభ్యులను చేర్చుకోవడం ఇప్పుడు మరింత సులభం!
- WhatsApp New Feature : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై నేరుగా వీడియో మెసేజ్‌లు పంపొచ్చు!
- వాట్సాప్‌లో కొత్త అప్డేట్స్.. ఆకర్షణీయంగా సెర్చ్ బార్.. ఈజీగా గ్రూప్ క్రియేషన్!