ETV Bharat / science-and-technology

Video Calling Feature On Twitter : ట్విట్టర్​లో వీడియో కాలింగ్​ ఫీచర్​!.. ధ్రువీకరించిన ఎక్స్​ సీఈఓ లిండా! - tech news in telugu 2023

Video Calling Feature On Twitter In Telugu : ట్విట్టర్​లో వీడియో కాలింగ్​ ఫీచర్​ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఎక్స్​ సంస్థ సీఈఓ లిండా యాకరినో స్పష్టం చేశారు. దీని వల్ల యూజర్లు రియల్​ టైమ్​లోనే ఒకరితో ఒకరు అనుసంధానం కాగలరని ఆమె తెలిపారు. మరి ఈ నయా ఫీచర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా?

Video Calling Feature On X Platform
Video Calling Feature On Twitter
author img

By

Published : Aug 12, 2023, 11:11 AM IST

Video Calling Feature On Twitter : ఎక్స్​ (ట్విట్టర్​) సీఈఓ లిండా.. త్వరలోనే ఎక్స్​ ప్లాట్​ఫారమ్​లో వీడియో కాలింగ్​ (వీడియో ఛాట్​) ఫీచర్​ను అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ ఫీచర్​ వచ్చిన తరువాత యూజర్లు తమ ఫోన్ నంబర్​ను ఇతరులతో పంచుకోకుండానే వీడియో కాలింగ్ (Twitter Video Calling Feature)​ చేసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు.

మస్క్​ విజన్​కు అనుగుణంగా
Elon Musk Vision For Twitter : ఎక్స్​ అధినేత ఎలాన్​ మస్క్​.. ఈ సోషల్​ మీడియా యాప్​ను ఎవ్రిథింగ్​ యాప్​గా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే లిండా యాకరినో.. వీడియో కంటెంట్​, పేమెంట్ సర్వీసెస్​, సబ్​స్క్రిప్షన్​ లాంటి అనేక ఫీచర్లను ఎక్స్​ ప్లాట్​ఫాంలో పొందుపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు.

వీడియో కాల్​ చేశాను!
Twitter Video Calling Feature : వాస్తవానికి ఈ వారం ప్రారంభంలో ఎక్స్​ డిజైనర్​ ఆండ్రియా కాన్వే.. ఎక్స్​ వీడియో కాలింగ్​ ఫీచర్​ గురించి ఒక పోస్ట్ చేశారు. దానినే ఇప్పుడు లిండా యాకరినో ధ్రువీకరిస్తూ మరో పోస్టు పెట్టారు. వాస్తవానికి ఈ పోస్టులో నేరుగా వీడియో కాలింగ్​ గురించి ఆమె స్పష్టంగా పేర్కొనలేదు.. కానీ 'ఇప్పుడే ఒకరికి ఎక్స్​ ద్వారా కాల్​ చేశాను' అని పేర్కొన్నారు. దీనితో వీడియో కాలింగ్​ ఫీచర్​ గురించి ఒక స్పష్టత ఇచ్చినట్లు అయ్యింది.

భారీ పోటీ ఉంది!
Twitter Competitors : ఇప్పటికే మార్కెట్​లో జూమ్, మైక్రోసాఫ్ట్​ టీమ్స్​, గూగుల్​ మీట్​, యాపిల్​ ఫేస్​టైమ్​ లాంటి అనేక ప్లాట్​ఫాంలు.. వీడియో కాలింగ్ ఫీచర్​ను అందిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఎక్స్​లోనూ వీడియో కాలింగ్ ఫీచర్​ తీసుకురావడం వల్ల కొత్తగా ఏం ఉపయోగం ఉంటుందని కొంత మంది ప్రశ్నిస్తున్నారు.

డిజిటల్​ హబ్​
Twitter Features 2023 : విమర్శలు ఎన్ని వస్తున్నా.. ఎలాన్​ మస్క్​, లిండా ఆలోచనలు మాత్రం చాలా భిన్నంగా ఉన్నాయి. వీరు ఎక్స్​ను కేవలం ఒక సోషల్​ మీడియా వేదికగా మాత్రమే చూడడం లేదు. వాస్తవానికి ఎక్స్​ను ఒక రియల్​ టైమ్​ డిజిటల్​ హబ్​గా మార్చాలని భావిస్తున్నారు. ముఖ్యంగా మీడియా, కమ్యునికేషన్​, ఆర్థిక లావాదేవీలు జరిపే వేదికగా దీనిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.

లాంగ్​ ఫార్మ్​ వీడియో కంటెంట్​
Twitter Long Video Duration : ట్విట్టర్​ పేరును ఎక్స్​గా మార్చిన తరువాత.. ఆ ప్లాట్​ఫాంలో అనేక సరికొత్త మార్పులు చేశారు. మొదటిగా ఎక్కువ నిడివి గల వీడియోలను కూడా పోస్టు చేసుకునే ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా ట్విట్టర్ బ్లూ ఫీచర్​ ద్వారా​ యూజర్లు రెండు గంటల నిడివి గల వీడియోలను అప్​లోడ్ చేసుకోవడానికి వీలు కల్పించారు. దీనిలో యాపిల్​ కంపెనీ ఈ ఫీచర్​ను ఉపయోగించుకొని.. తమ సిరీస్​ 'Silo' మొదటి భాగాన్ని ట్విట్టర్​లో పోస్టు చేసింది.

మోనిటైజేషన్​
Twitter Monetization : ఎక్స్​ (ట్విట్టర్)లో మంచి యూజర్​ ఫాలోయింగ్ ఉన్న కంటెంట్​ క్రియేటర్లకు మోనటైజేషన్​ ఎనేబుల్ చేశారు. దీని ద్వారా ఓ కంటెంట్​ క్రియేటర్​.. తాను దాదాపు 24,000 డాలర్ల వరకు​ సంపాదించానని చెప్పడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.