ETV Bharat / science-and-technology

ట్విట్టర్​లో భారీ మార్పు​.. ఇకపై 2,500 అక్షరాల వరకు ట్వీట్​!

Twitter Character Limit: ట్విట్టర్​ మనం ఏదైనా పోస్ట్ చేయాల‌నుకుంటే 280 అక్ష‌రాలు మాత్ర‌మే రాయ‌గ‌లం. అంత‌కు మించి క్యారెక్టర్లు వాడాల‌నుకుంటే మ‌రో ట్వీట్ చేయాల్సిందే. అయితే ఇప్పుడు అలా కాకుండా.. 2500 అక్షరాల వరకు ట్వీట్​ చేయొచ్చు. త్వరలోనే ఈ ఫీచర్​ను ట్విట్టర్​ అందుబాటులోకి రానుంది.

Twitter testing 2,500 character limit for a post

author img

By

Published : Jun 23, 2022, 12:54 PM IST

ప్రముఖ సోషల్​ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను యాడ్ చేస్తుంటుంది. ఇందులో భాగంగా ట్వీట్ ఎడిట్ ఫీచర్​ను టెస్టింగ్​లో భాగంగా కొంతమంది యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మరో ఫీచర్​ను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది.
Twitter Character Limit: సాధారణంగా ట్విట్టర్​లో ఏదైనా రాసి పోస్ట్ చేయాల‌నుకుంటే కేవ‌లం 280 అక్ష‌రాలు వరకే ట్వీట్​ చేయగలం​. అంత‌కు మించి క్యారెక్టర్లు వాడాల‌నుకుంటే మ‌రో ట్వీట్ చేయాల్సిందే. అందువల్ల కొన్నిసార్లు యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. అది గుర్తించిన ట్విట్టర్​.. అక్ష‌రాల ప‌రిమితిని 280 నుంచి ఏకంగా 2,500కు పెంచాల‌ని​ యోచిస్తోంది. ఈ మేర‌కు నోట్స్ పేరిట‌ కొత్త ఫీచ‌ర్​ను త్వరలోనే తీసుకురానుంది. ఈ ఫీచ‌ర్ ప్ర‌స్తుతం టెస్టింగ్ ద‌శ‌లో ఉంది. అందుబాటులోకి రాగానే యూజ‌ర్లు త‌మ సుదీర్ఘ సందేశాలను పోస్ట్​ చేయొచ్చు.

దాంతో పాటు ఫొటోలు, వీడియోల వంటివి కూడా జోడించ‌వ‌చ్చు. ఈ కొత్త ఫీచ‌ర్ ట్విట్టర్​ టైమ్​లైన్‌లో ఉంటుంది. మీరు చేసే ఈ సుదీర్ఘ‌ ట్వీట్‌ ప్రివ్యూను కూడా చూసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే అమెరికా, యూకే, కెన‌డా, ఘ‌నాలో ప్ర‌యోగాత్మ‌కంగా ట్విట్టర్​ ఈ ఫీచ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నోట్‌ను షేర్ చేసుకోవాల‌నుకునే వారి కోసం అందుకోసం ప్ర‌త్యేకంగా లింక్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. 2017 కంటే ముందు ట్విట్టర్​లో క్యారెక్ట‌ర్ల ప‌రిమితి 140గా ఉండేది. అయితే, అనంత‌రం ఆ ప‌రిమితిని 280కి పెంచారు. ఇప్పుడు 2500 వరకు పెంచనుంది.

ఇవీ చదవండి: పాత ల్యాప్​టాప్ కొంటున్నారా? ఈ 5 టెస్టులు చేస్తేనే మీరు సేఫ్!

వాట్సాప్​లో కొత్త ఫీచర్స్.. చాట్​ లిస్ట్​లోనే స్టేటస్​.. గ్రూప్ కాలింగ్​లో మ్యూట్​​ ఆప్షన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.