ETV Bharat / science-and-technology

ట్రూకాలర్‌ కొత్త ప్లాన్.. ఫ్యామిలీ మొత్తానికి ఒకటే సబ్‌స్క్రిప్షన్‌

స్పామ్‌, స్కామ్‌ కాల్స్‌ ద్వారా జరిగే మోసాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ట్రూకాలర్‌ మరో కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో యూజర్లు యాడ్‌-ఫ్రీ సేవలను పొందడమే కాకుండా.. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని కంపెనీ చెబుతోంది.

truecaller premium plan
ట్రూకాలర్‌ కొత్త ప్లాన్
author img

By

Published : Dec 19, 2022, 8:39 AM IST

Updated : Dec 19, 2022, 8:49 AM IST

Truecaller Premium Plan: కాలర్‌ ఐడెటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌ ఫ్యామిలీ ప్లాన్‌ పేరుతో కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ కింద ఐదుగురు యూజర్లు ఒకేసారి ట్రూకాలర్‌ ప్రీమియం సేవలను పొందొచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్న యూజర్ దానిని కుటుంబసభ్యులతోపాటు, స్నేహితులతో షేర్ చేసుకునే సౌకర్యం ఉంది. ఫ్యామిలీ ప్లాన్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ధర రూ.132గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం ట్రూకాలర్ నెలవారీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ సేవలకు రూ.39, ప్రీమియం కనెక్ట్‌కు రూ.75 రుసుమును వసూలు చేస్తోంది.

ట్రూకాలర్‌ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా యూజర్లకు యాడ్‌-ఫ్రీ సేవలతోపాటు పలు రకాల అడ్వాన్స్‌డ్‌ సర్వీస్‌లను అందిస్తోంది. స్పామ్‌కాల్స్‌ రాకుండా అడ్డుకోవడం, ట్రూకాలర్ ప్రొఫైల్‌ ఎవరెవరు చూశారనేది తెలుసుకోవడం, ప్రీమియం బ్యాడ్జ్‌, అన్‌లిమిటెడ్‌ కాంటాక్ట్ రిక్వెస్ట్‌, ఇన్‌కాగ్నిటో మోడ్‌, కాలర్‌ అనౌన్స్‌మెంట్‌, ఘోస్ట్ కాల్స్‌ వంటివి అదనంగా పొందుతారు. దాంతోపాటు యాపిల్‌ వన్‌, స్పోటిఫై ఫ్యామిలీ సబ్‌స్క్రిప్షన్‌ తరహాలో ట్రూకాలర్ ఫ్యామిలీ సబ్‌స్క్రైబర్లు ఒకరి వ్యక్తిగత వివరాలను మరొకరితో పంచుకోలేరని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఈ సేవలను అమెరికా మినహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని యూజర్లకు అందుబాటులో ఉన్నట్లు ట్రూకాలర్‌ తెలిపింది. స్పామ్‌, స్కామ్‌ కాల్స్‌ ద్వారా జరిగే మోసాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ట్రూకాలర్‌ ఫ్యామిలీ ప్లాన్‌ సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా యూజర్లు తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు సైబర్‌ మోసాల నుంచి భద్రత కల్పించవచ్చని కంపెనీ చెబుతోంది.

గత నెలలో ట్రూకాల్‌ గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ పేరుతో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల పేరుతో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు. యూజర్ల ఫోన్‌కు ఎవరైనా ప్రభుత్వ అధికారి లేదా కార్యాలయం నుంచి ఫోన్‌ చేస్తే.. స్క్రీన్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో గ్రీన్‌ కలర్‌ కనిపిస్తుంది. అలానే ఫోన్‌ నంబర్‌ పక్కన బ్లూ టిక్ ఉంటుంది. దీంతో ఫోన్‌ ప్రభుత్వ అధికారి నుంచి వచ్చిందా? లేదా? అనేది యూజర్‌ సులువుగా నిర్ధరించుకోవచ్చు.

Last Updated : Dec 19, 2022, 8:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.